Chhattisgarh: Minor girl raped by elder brother, neighbour

Minor girl raped by elder brother neighbour

rape, gangrape, child abuse, chhattisgarh, brother, neighbour, minor girl rape in chhattisgarh, minor girl rape in Janjgir-Champa district, rape in minors, harrassment on minors, domestic voilence on women, sexual assult on minors. chhattisgarh minors rape

In a shocking incident, a 15-year-old girl was allegedly raped by her elder brother who also forced the victim to sleep with their neighbour in Chhattisgarh's Janjgir-Champa district

మైనర్ బాలికపై పోదరుడు, పోరుగింటివాడు అత్యాచారం

Posted: 06/16/2016 05:15 PM IST
Minor girl raped by elder brother neighbour

చత్తీస్ గడ్ లో దారుణం జరిగింది. అన్నా అన్న మాటలో వున్న తీయదనం వాడికి తెలియదు. అడపడుచుకు అండగా వుండాల్సిన వాడు ఏకంగా అమెను చెరబట్టాడు. తన తోడబుట్టినది అన్న విషయాన్ని కూడా మర్చిపోయిన దుర్మార్గుడు 15 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారానికి చెరబడ్డాడు. అంతటితో అగకుండా అమెను బలవంతంగా వ్యభిచారం రోంపిలోకి దింపాడు. తమ పక్కింట్లో నివసించే 59 ఏళ్ల వృద్దుడితో కూడా పడుకోవాలని అమెను బలవంతంగా అతని వద్దకు పంపాడు. ఈ ఘటన చత్తీస్ గడ్ రాష్ట్రం జంగీర్ చంపా జిల్లాలోని పామ్ గర్ పట్టణంలో జరిగింది.

తన సోదరుడు, పక్కింటి వాడు తనపై రోజు చేస్తున్న అత్యాచారాన్ని తట్టుకోలేక ఆ బాలిక ఇంట్లోనుంచి పారిపోవడంతో విషయం బయటపడింది. దీంతో బాధితురాలి సోదరుడితో పాటు పక్కింటి వృద్దుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాలిక తరపున బిలాస్ పూర్ కు చెందిన మహిళా ఎవమ్ బాల్ కల్యాణ్ సమితి సభ్యులు పిర్యాదు అందించడంతో రంగంలోకి దిగిన పోలీసుల అమెపై అత్యాచారానికి ఒడిగట్టిన ఇద్దరినీ అరెస్టు చేసినట్టు పామ్ గర్ స్టేషన్ హౌస్ అధికారి కె ఎల్ యాదవ్ తెలిపారు.

సోదరుడు, పక్కింటి వృద్దుడి అమెపై జరుపుతున్న అత్యాచారాన్ని భరించలేక ఇంట్లోంచి పారిపోయిన బాలిక నేరుగా బిలాస్ పూర్ రైల్వే స్టేషన్ కు చేరుకుంది. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలో తెలియక స్టేషన్ లోనే తలదాచుకుంటుంది. దీంతో బాలికను గమనించిన రైల్వే పోలీసులు అమెను బిలాస్ పూర్ కు చెందిన మహిళా ఎవమ్ బాల్ కల్యాణ్ సమితికి అప్పగించారు. తనకు రక్షణ లభించిన తరువాత తనపై తన సోదరుడు, వృద్దుడు జరిపిన అత్యాచారం గురించి బాలిక సమితీ సభ్యులకు తెలిపింది.

సదరు సమాచారాన్ని సమితి చైర్ పర్సెన్ మమతా తివారి పోలీసులకు పిర్యాదు చేశారు. ముందుగా బాలిక పిర్యాదును బిలాస్ పూర్ లోని సర్కందా పోలిస్ స్టేషన్లో నమోదు చేయగా, ఆ తరువాత దానిని బాలిక నివాఃమున్న ప్రాంతంలోని పామ్ గర్ పోలిస్ స్టేషన్ కు బదలాయించారు. బాలిక తల్లి కొన్ని సంవత్సరాల క్రితం మరణించడంతో పట్టణంలోని మెయిన్ రోడ్డులో వున్న తమ నివాసంలో బాలిక తమ సోదరుడితో కలసి వుంటుందని పోలీసులు తెలిపారు. అయితే ఇంటిని తాను శాశ్వతం చేసుకునే క్రమంలో పక్కింట్లో వుండే గెండురామ్ సోదరుడిని రెచ్చగోట్టి తనపై అత్చాచారం చేయించాడని కూడా పోలీసులు దర్యాపులో బయటపడింది.  దీంతో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rape  gangrape  child abuse  chhattisgarh  brother  neighbour  crime  

Other Articles