గుల్బర్గ్ నరమేధంలో శిక్షలు ఖరారు | quantum of punishment pronounced in Gulbarga Society massacre

Quantum of punishment pronounced in gulbarga society massacre

Gulbarga Society massacre, 24 convicts in the Gulbarga Society massacre case, Ahmedabad special court, గుల్బర్గ్ నరమేధం, గుల్బర్గ్ ఊచకోతలు, గుల్బర్గ్ నరమేధం శిక్షలు ఖరారు, గుల్బర్గ్ ఊచకోత శిక్షలు ఖరారు, latest news, telugu news, తెలుగు వార్తలు. జాతీయ వార్తలు, రాజకీయాలు, గుజరాత్ ఊచకోతలు

Ahmedabad special court pronounced the quantum of punishment to the 24 convicts in the Gulbarga Society massacre case; 11 convicts awarded life imprisonment; 1 accused sentenced for 10 years; 7 years jail term for 12 others.

గుల్బర్గ్ నరమేధంలో శిక్షలు ఖరారు

Posted: 06/17/2016 12:44 PM IST
Quantum of punishment pronounced in gulbarga society massacre

14 ఏళ్ల క్రితం నాటి గుల్బర్గ్ నరమేధంలో శిక్షలు ఖరారయ్యాయి. 2002 లో గుజరాత్ లోని గుల్బర్గ్ సోసైటీలో జరిగిన ఊచకోతలో కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎహసాన్ జాఫ్రీతోసహా 69 మంది బలయ్యారు. జాతి యావత్తును భయ కంపితులను చేసిన ఈ కేసు పద్నాగేలుగా అహ్మదాబాద్ లోని ప్రత్యేక కోర్టులో విచారణ సాగుతోంది. ఈ కేసులో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న 11మందికి న్యాయ‌స్థానం జీవిత ఖైదు విధించింది. మిగిలిన 13మందిలో 12మందికి ఏడేళ్లు జైలు శిక్ష, మరొకరికి పదేళ్ల జైలు శిక్షను విధిస్తూ న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది.

ఊచకోత కేసులో బిజెపి సిట్టింగ్‌ కార్పొరేటర్‌ బిపిన్‌ పటేల్‌తో సహా 24 మందిని నిందితులుగా గతంలోనే కోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే. తొలుత మొత్తం 66 మందిని నిందితులుగా పేర్కొంటూ గతంలో చార్జిషీటు దాఖలు చేశారు. అయితే ఈ కేసు విచార‌ణ‌ సమయంలోనే ఐదుగురు చ‌నిపోయారు. మ‌రో వ్యక్తి అదృశ్యమయ్యాడు. అయితే అందులో కేవలం 24 మంది మాత్రమే దోషులుగా పేర్కొన్న న్యాయ‌స్థానం మిగిలిన 36మందిని నిర్దోషులని పేర్కొంది. సుదీర్ఘ విచారణ జరిపిన అనంతరం ఆ 24 మంది దోషులకి శిక్షలు ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది.

గోద్రా అల్లర్లు జరిగిన మరుసటి రోజే గుల్బర్గ్ సొసైటీ ఊచకోత చోటుచేసుకుంది. దీనిని రాజకీయం చేద్దామని కాంగ్రెస్ ప్రయత్నించినప్పటికీ, ఈ వ్యవహారంపై కోర్టు మందలించడంతో వెనక్కి తగ్గింది. న్యాయం కోసం బాధిత కుటుంబాలు తీవ్రంగా పోరాడాయి కూడా. ఇక్కడ ఇప్పుడు కోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో మత విద్వేషదాడులకు పాల్పడే వారికి తీవ్ర హెచ్చరిక ఇచ్చినట్లు అయ్యింది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles