వెంకయ్య పని అయిపోయింది | venkaiah naidu good bye to politics

Venkaiah naidu good bye to politics

venkaiah naidu good bye to politics, ఆత్మీయ సభలో వెంకయ్య, రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై, రాజ్యసభకు కూడా పోటీచేనంటున్న వెంకయ్యన, వెంకయ్య పని అయిపోయింది, తెలుగు రాజకీయాలు, వెంకయ్య నాయుడు ఆత్మీయ సభ, వెంకయ్య ఇక వీడ్కోలు, తాజా వర్తలు, తెలంగాణ వార్తలు, latest news, telugu news, venkaiah facilitated in telugu states

venkaiah naidu good bye to politics. no more contesting in elections.

వెంకయ్య పని అయిపోయింది

Posted: 06/17/2016 06:41 PM IST
Venkaiah naidu good bye to politics

ఎక్కడా ప్రత్యక్ష రాజకీయాల ప్రస్తావన లేకుండా కేవలం పరోక్ష రాజకీయాల ద్వారానే అగ్రనేతగా ఎదిగారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. ఆయన సేవలను గుర్తించిన పార్టీ కూడా పదవుల విషయంలో కొన్ని నియమాలు పాటించాలన్న పార్టీ అంతర్గత నిర్ణయాన్ని పక్కనబెట్టి మరీ ఆయన్ను నాలుగో సారి రాజ్యసభకు పంపింది. ఇక జై ఆంధ్రా ఉద్యమంలో కీలక పాత్ర పోషించానని చెప్పుకుంటున్న ఆయన ఇప్పుడు కీలకపదవిలో ఉండి కూడా ఏపీకి జరిగే అన్యాయంపై పోరాడలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే తాను త్వరలో రాజ‌కీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెబుతానంటూ సంకేతాలు ఇచ్చేశారు.

రాజ్యసభ సభ్యుడిగా నాలుగోసారి ఎన్నికైన ఆయనకు కార్యకర్తలు శుక్రవారం ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఆత్మీయ సన్మానం చేశారు. ఉదయం విజయవాడలో జరిగిన సభలో పెద్దగా ప్రసంగం చేయని ఆయన సాయంత్రం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో జరిగిన సభలో మాత్రం బాగానే మాట్లాడారు. రాజకీయాల్లోకి వ‌చ్చేముందు వాజ్‌పేయి, అద్వానీ లాంటి గొప్ప నాయ‌కుల‌ పక్కన కూర్చోగ‌ల‌న‌ని ఊహించ‌లేదని ఆయన అంటున్నారు. న‌మ్మిన సిద్ధాంతానికి క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని, క‌ష్టపడి ప‌నిచేశాను కాబట్టే పార్టీలో మంచి పేరు తెచ్చుకున్నాన‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

‘రాజ‌కీయ జీవితంలో నేనెప్పుడూ రాజీ ప‌డ‌ను, ప‌డ‌లేదు.. ఆటు పోట్లను ఎదుర్కుంటూ ముందుకు వెళితేనే విజ‌యం వ‌స్తుంది. నా నిబద్ధతతోనే బీజేపీలో మంచి పేరు తెచ్చుకున్నాను.’ అని ఆయ‌న అన్నారు. సుదీర్ఘ ప్రస్థానంలో అలసిపోయానని, ఇక‌పై ప‌రోక్ష ఎన్నిక‌ల్లోనూ పోటీ చేయ‌బోను అని ఆయ‌న ప్రకటించారు. ప్రజా సేవ‌కు ప‌ద‌వులు అక్కర్లేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా రాజ‌కీయాలు మారాల్సి ఉందన్న ఆయన, స‌మాజంలోని అన్ని వ‌ర్గాలు అభివృద్ధి చెందే విధంగా రాజకీయాలు, నేతలు మారాలని పిలుపునిచ్చారు.

భాస్కర్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : venkaiah naidu  goodbye to politics  venkaiah facilitated  

Other Articles