mudragada pabmanabham health condition detoriates as his hunger stirke reaches eleventh day

Mudragada pabmanabham on eleventh day hunger strike

mudragada hunger strike, mudragada padmanabham, hunger strike in hospital, hunger strike, kapu reservation stir, kapu garjana, chandrababu naidu, kapu leaders, hunger strike, pesticide, tuni violence, mudragada padmanabham, amalapuram one town police station, Mudragada fast unto death, mudragada hunger strike, NTR,

Kapu caste leader Mudragada padmanbham health condition detoriates as his hunger stirke reaches eleventh day

పదకోండో రోజుకు ముద్రగడ దీక్ష.. రాష్ట్రవ్యాప్తంగా అందోళనలు..

Posted: 06/19/2016 06:04 AM IST
Mudragada pabmanabham on eleventh day hunger strike

కాపులను బిసిలలోకి చేర్చాలని డిమాండ్ చేస్తూ.. కాపు హక్కుల ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన అమరణ దీక్ష పదవ రోజుకు చేరుకుంది. దీంతో ఆయన అరోగ్యం ప్రాణాపాయ స్థితిలో వున్నారు. ఏ క్షణంలో ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితుల్లోకి జారుకున్నారు.. ఆయన అరోగ్య పరిస్థితి మరింతగా క్షీణిస్తుందని వైద్యులు అంటున్నారు. ముద్రగడ శరీరంలో కీటోన్ల సంఖ్య మరింతగా పెరుగుతున్నాయని.. ఇవి ప్రమాదకర సంకేతాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే వైద్యంతో కొంతమేరకు కీటోన్లను తగ్గించామని వైద్యులు తెలుపుతున్నారు.

ముద్రగడ పద్మనాభం హెల్త్ బులెటిన్ నురాజమండ్రి ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ రమేష్ కిశోర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....ముద్రగడ సహా ఆయన కుటుంబసభ్యులకు రెండు గంటలకొకసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ముద్రగడ సతీమణి పద్మావతికి కడుపు నొప్పికి మందులు ఇస్తున్నట్లు చెప్పారు. ఆయనకు గుండె సంబంధిత పరీక్షలు నిర్వహించామని, మూత్రపిండాల్లో కీటోన్ లెవల్స్ 2 ప్లస్కు తగ్గాయని వైద్యులు రమేశ్ కిశోర్ తెలిపారు.

ఈ స్థితిలో రాజమహేంద్రవరంలోనే ఉంచి వైద్యం చేసినా ప్రాణాపాయమని వైద్యులు చెబుతున్నారు. దీంతో ఆయన అరోగ్య పరిస్థితి మళ్లీ ప్రమాద స్థాయికి చేరుకుంటుందని.. ఈ నేపథ్యంలో అయనకు ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వక తప్పనిసరి పరిస్థితి నెలకోందని వైద్యులు చెబుతున్నారు. ఆయన బీపి షుగర్ లెవల్స్ కూడా కంట్రోల్ లో లేవని తెలుస్తుంది. ఇంకా ముద్రగడ దీక్షను చేపట్టడం ఆయన అరోగ్యరిత్యా మంచిది కాదని కూడా వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఫ్లూయిడ్స్ పెడుతున్నా ముద్రగడ ఆరోగ్యాన్ని నియంత్రించడం కష్టమవుతోందని వైద్యులు చెబుతున్నారు. ముద్రగడతో పాటు కోడలు సిరి ఆరోగ్యం మరింత ఆందోళనకరంగా ఉంది. ఆమె నోట మాట రావడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.  

ముద్రగడ దీక్ష విషయంలో ఆయనను అనుమానించేలా, ఆయన నిజాయితీని అవమానించేలా మంత్రులు మాట్లాడటం తగదని ఒకవైపు కాపు ప్రముఖులు అందరూ చెబుతున్నా.. తాజాగా మంత్రి కామినేని శ్రీనివాస్  మాత్రం మళ్లీ అదే పద్ధతిలో మాట్లాడారు. పదోరోజు నిరాహార దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని కామినేని అన్నారు. దీంతో కాపు నేతలు అలా మాట్లాడే నేతలు కనీసం వారం రోజులు నిరాహారదీక్ష చేసి వారి అరోగ్యాన్ని చూసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చౌకబారు విమర్శలు చేసే మంత్రులకు రానున్న ఎన్నికలలో గుణపాఠం చెబుతామని అంటున్నారు.

కాపు ఉద్యమనాయకుడు ముద్రగడ దీక్షకు మద్దతుగా గోదావరి జిల్లాల్లో కాపు నేతల ఆందోళనలు కొనసాగుతున్నాయి. కిర్లంపూడి మండలం గోనాడలో శనివారం ఉదయం నేతలు రిలే దీక్షలకు దిగారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మండపేటలో ఇద్దరు కాపు నాయకులు సెల్ టవర్ ఎక్కారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి వారిని కిందికి దించే ప్రయత్నాలు చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా అరెస్ట్ను నిరసిస్తూ కోరుకొండలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.

అయినవెల్లి మండలం ముక్తేశ్వరంలో కాపు నేతల నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కాపు నేతలను చెదరగొట్టి, పలువురిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఆచండ నియోజకవర్గం మార్టేరులో వందలాది మంది కాపు సామాజికవర్గానికి చెందిన వారు ర్యాలీ నిర్వహించారు. అనంతరం  ప్రధాన రహదారిలో ధర్నా, మానవహారం చేశారు. ముద్రగడ దీక్షను విరమింపజేయాలని, ప్రభుత్వం కాపులకు న్యాయంచేయాలని నేతలు డిమాండ్ చేశారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mudragada padma nabham  hunger strike  hospital  

Other Articles