కీలక వేళల్లో చాలినన్ని బస్సులు లేకపోతో ఫుట్ బోర్డు ప్రయాణం చేయటం ఎక్కడైనా సర్వసాధారణంగా కనిపించే అంశమే. కిటికీలకు వేలాడుతూ, పాఠశాలలకు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, ఆఫీసులకు చేరుకునే ఉద్యోగులను ఇక్కడా మనం చూస్తుంటాం. అయితే తమిళనాడులో మాత్రం అదీ మరీ దారుణంగా ఉంటుంది. సమయం మించి పోతున్నదనో లేక మరేయితర కారణాలతోనో ఫుట్ బోర్డు జర్నీ చేసే వారి సంఖ్య రోజు రోజుకీ అక్కడ ఎక్కువగా కనిపిస్తోంది. ఫలితంగా అక్కడ ఫుట్ బోర్డు మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి.
ఇటీవలి కాలంలో బస్సుల్లో ప్రమాదకరంగా ప్రయాణిస్తూ, రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో, దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫుట్ బోర్డుపై ప్రయాణిస్తూ, పట్టుబడే విద్యార్థుల బస్ పాస్ లను స్పాట్ లోనే రద్దు చేయాలని సీఎం జయలలిత ఆదేశించింది. ఈ మేరకు సోమవారం నాడు తమిళనాడు విద్యాశాఖ నుంచి సంచాలకులకు ఉత్తర్వలు జారీ అయ్యాయి.
అయితే గతంలోనూ ఇలా ఫుట్ బోర్డు జర్నీ చేస్తూ విద్యార్థులు పట్టుబడినప్పుడు పోలీసులు కొన్ని కఠిన చర్యలు తీసుకున్నారు. రూ. 500 జరిమానా, తల్లిదంద్రులకు కౌన్సెలింగ్ ఇవ్వడం, టీసీలు ఇచ్చి పంపడం వంటి చర్యలు చేపట్టినా, అది కొంతకాలానికే పరిమితమైంది. ఇక ఇప్పుడు విద్యా సంవత్సరం ప్రారంభమైన వేళ, విలువైన విద్యార్థుల ప్రాణ నష్టాన్ని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు జయ సర్కారు చెబుతోంది.
భాస్కర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more