స్నేహమేరా జీవితం... అదేరా శాశ్వతం అంటూ సినిమాలో హీరోలు పాటలు పాడుకుంటుంటే భలే నటిస్తూన్నారని చప్పట్లు చరుచుకోవటం తప్పించి స్నేహాన్ని విలువను మాత్రం మనం గుర్తించలేకపోతున్నాం. అవసరం కోసం వాడుకోవటం తప్పించి స్నేహం గొప్పతనాన్ని గుర్తించే వారు ఎంత మంది ఉన్నారు చెప్పండి?
తాజాగా తమిళనాడులో జరిగిన ఓ ఉదంతం తెలిస్తే షాకవుతారు. తన త్యాగంతో స్నేహంలోని మాధుర్యాన్ని చాటిచెప్పింది ఓ యువతి. తన బాల్యస్నేహితురాలి కోసం వచ్చిన మంచి అవకాశాన్ని వదులేసుకుంది. స్నేహితురాలని దూరం చేసుకోలేక ఆమె ఏం చేసిందో తెలిస్తే ఎవరైనా హర్షించక మానరు.
త్రిచికి చెందిన జననీ, వర్షిణిలు ఎల్ కేజీ నుంచి ఫ్రెండ్స్. ఇద్దరు ఒకే స్కూల్లో, ఒకే కాలేజీలో చదివారు. ఇద్దరూ తాజాగా మెడికల్ ఎంట్రన్స్ కూడా రాశారు. అయితే కేవలం పాయింట్ల తేడాతో వర్షిణి జననీ కంటే ముందు నిలిచింది. ఇక కౌన్సిలింగ్ సమయంలోనే అసలు కథ మొదలైంది. ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో ఇద్దరు హాజరైనప్పటికీ వర్షిణికి మంచి ర్యాంకు రావటంతో మద్రాస్ యూనివర్సిటీలో అవకాశం లభించింది. అయితే కోటాలో ఒకే సీటు మిగిలి ఉండటంతో జనని తనకు దూరం కావటం ఇష్టం లేని వర్షిణి ఆ సీటును వదులేసుకుంది. కానీ, తర్వాతి ఉన్న జననిని ఆ సీటు తీసుకోమని చెప్పింది.
ఎందుకిలా చేశావని ప్రశ్నిస్తే తనకు అదనంగా బీసీ కోటా ఉండటంతో తర్వాతి కౌన్సిలింగ్ లో జనరల్ కోటాలో సీటు వచ్చే అవకాశం ఉందంటోంది. మొత్తం 71 సీట్లున్న మద్రాస్ యూనివర్సిటీ లో స్పోర్ట్స్ కోటాలు 3, ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో 6 సీట్లకు కౌన్సిలింగ్ పూర్తయింది. ఇక మిగిలినవాటిని జనరల్ కేటగిరీలో భర్తీ చేయనున్నారు. మరి స్నేహితురాలు దూరంకాకుండా ఉండేందుకు కాన్ఫిడెన్స్ తో వర్షిణి చేసిన త్యాగం ఫలిస్తుందా? లెట్ వెయిట్ అండ్ సీ...
భాస్కర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more