Model's cries of 'No!' unclear, must pay $35,000 for falsely accusing 2 men of raping her on video, judge rules

German model who claimed rape fined 34 800 as judge rules she said no to the filming not sex act itself

German model, Stanford University swimmer, Gina-Lisa Lohfink, sexual assault, German lawmakers, model drugged, model raped, model 18 lakhs fine

A German model was fined $35,000 for accusing two men of recording themselves raping her after the judge decided the video showed her saying "No!" to only the filming, not the sex.

అత్యాచార బాధితురాలి ఆక్రంధన.. అన్యాయమేంటని మోడల్ ప్రశ్న..

Posted: 06/24/2016 10:01 AM IST
German model who claimed rape fined 34 800 as judge rules she said no to the filming not sex act itself

తనపై అత్యాచారం చేసిన వారిపై కేసు పెడితే.. న్యాయస్థానం తననే దోషిగా తేల్చి 18 లక్షల పైచిలుకు రూపాయలను జరిమానా విధించిందని.. వాపోయింది ఆ బాధితురాలు. అయితే తనకు జరిగిన అన్యాయంతో పాటు అత్యాచారాన్ని బాహ్య ప్రపంచానికి తెలియజేసింది. అమె మరెవరో కాదు ఓ ప్రముఖ మోడల్. తాను ఎదుర్కోన్న విపత్కర పరిస్థితులను అమె సామాజిక మాద్యమం ద్వారా ప్రపంచానికి తెలియజేసింది. తనకు డ్రగ్స్ ఇచ్చి, అత్యాచారం చేయడమే కాక.. ఆ దారుణాన్ని వీడియో తీసి ఆన్లైన్లో పోస్ట్ చేశారని బాధితురాలు వాపోయింది.

తనకు జరిగిన అత్యాచార ఘటనపై కేసు పెడితే.. నిందితులను ఏమీ అనకపోగా.. తనకే ఏకంగా రూ. 18 లక్షలకు పైగా జరిమానా విధించారని తెలిపింది. వీడియో తీయడం సరికాదని మాత్రమే జడ్జి చెప్పారని, కానీ అత్యాచారం విషయంలో ఏమీ అనలేదని వాపోయింది. అత్యాచారం ఆరోపణలు తప్పని తేల్చిన కోర్టు... తనకు జరిమానా విధించిందని చెప్పింది. గినా - లిసా లోఫింక్ అనే ఈ మోడల్ తనకు ఎదురైన ఈ చేదు అనుభవాన్ని ఫేస్బుక్ ద్వారా ప్రపంచానికి వెల్లడించింది. దీంతో లైంగిక దాడుల కేసులను విచారించడంలో కోర్టులు ఎలా వ్యవహరిస్తున్నాయనే అంశంపై మరోసారి చర్చ మొదలైంది.

ఇంతకుముందు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ఓ స్విమ్మర్ అత్యాచారం చేసినట్లు రుజువైనా కూడా అతడికి అమెరికా కోర్టు చాలా తక్కువ శిక్ష మాత్రమే విధించడం అప్పట్లో సంచలనం రేపింది. అయితే లోఫింక్ కేసు మాత్రం ఒక్కసారిగా పత్రికలలో పతాకశీర్షికలకు ఎక్కింది. బాధితురాలిని కాస్తా నేరస్తురాలిగా చేసేశారని లోఫింక్ వాపోయింది. తనను వాళ్లు చంపేసి ఉంటేనే కోర్టులు తనకు న్యాయం చేసేవా అని ఆమె ప్రశ్నించింది. జర్మనీలో అత్యాచారం చట్టాలు చాలా బలహీనంగా ఉన్నాయని మహిళా హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు.

ఈ చట్టాలు బలంగా ఉండాలని 86 శాతం మంది కోరుకుంటున్నారు. శారీరకంగా తనపై దాడి జరిగినట్లు బాధితురాలు నిరూపించుకోగలిగితేనే దాన్ని రేప్ అంటామని.. లేకపోతే అది అంగీకారంతో కూడిన శృంగారమే అవుతుందని ప్రస్తుత చట్టం ప్రకారం కోర్టులు చెబుతున్నాయి. 2012లో ఇలాగే ఓ గర్భవతిపై అత్యాచారం జరిగింది. తాను గట్టిగా ప్రతిఘటిస్తే గర్భంలో ఉన్న శిశువుకు ప్రమాదమన్న భయంతో ఆమె ఊరుకుండిపోయింది. దాంతో ఆ కేసును కోర్టు కొట్టేసింది! ఇలాంటి చట్టాలను మార్చాలని జర్మన్లు ఉద్యమిస్తున్నారు

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles