Hot blonde travels world free thanks to strangers from dating site

Around the world in 80 dates

Natalie Wood, Canterbury, Kent, dating site, Miss Travel, world tour by strangers, blonde bombshell,Turkey, Abu Dhabi, Dubai, the Maldives, Australia, Czech Republic, Kuwait, Miami, flights and accommodation, beautician, designer goods, flash cars, yachts, extravagant parties

A jetsetter is travelling the world on holiday for free thanks to an online dating site where men pay thousands to whisk her away.

పైసా ఖర్చులేకుండా ప్రపంచాన్ని తిరిగేసింది..!

Posted: 06/26/2016 10:57 AM IST
Around the world in 80 dates

ఇంటి నుంచి కాలు బయటపెట్టి.. గంటో.. అరగంటలోనో ఇంటికి తిరిగి వచ్చే సరికి జేబులో వున్న డబ్బులకు రెక్కలు వచ్చేస్తాయి. అలాంటి ఏ పుణ్యక్షేత్రానికో.. పర్యాటక ప్రాంతానికో వెళ్తే.. ఇక జేబులోని డబ్బులు గుల్ల అయినట్లే. ఇక మరో దేశానికి వెళ్లి ఖరీదైన హోటళ్లలో ఉండి, విమానాల్లో తిరుగుతూ, షాపింగ్ చేస్తూ ఎంజాయ్ చేయాలంటే... లక్షలు ఖర్చయిపోతాయి. కానీ, 30 సంవత్సరాల నటాలీ వుడ్ అనే బ్రిటన్ భామ రూపాయి ఖర్చు చేయకుండా ప్రపంచ దేశాలన్నీ తిరుగుతోంది. ఎలాగంటారా? పోయిన ప్రతి చోటా 'మిస్ ట్రావెల్' డేటింగ్ వెబ్ సైట్ లో ఓ ధనవంతుడిని తోడుగా చేసుకుంటూ ఉండటమే.

ఇప్పటివరకూ టర్కీ, అబూదాబీ, దుబాయ్, కువైట్, ఆస్ట్రేలియా వంటి ఎన్నో దేశాలు తిరిగిన నటాలీ ప్రస్తుతం మియామీలో ఉంది. తాను ఇప్పటివరకూ 80 మందితో డేటింగ్ చేశానని, దేశాలన్నీ తిరిగి రావాలన్న కోరికతో పాటు ఓ మంచి భర్తను వెతుక్కోవడమే తన లక్ష్యమని చెబుతోంది. తన డేటింగ్ టూర్ ఎంతో సంతోషాన్ని ఇస్తోందని, సంపన్న పురుషులు తన అందానికి ఇట్టే పడిపోతున్నారని, ఇక వారితో స్వల్పకాల లైంగిక బంధం తనకు ఇబ్బందేమీ కావడం లేదని చెబుతోంది.

ఇప్పటివరకూ దాదాపు కోటి రూపాయలకు పైగా తన కోసం డేటింగ్ ఫ్రెండ్స్ ఖర్చు చేసి వుండవచ్చని నటాలీ అంది. కువైట్ లో ఓ ఇంటర్నేషనల్ అకౌంటెంట్, ఆస్ట్రేలియాలో ఎన్నో సొంత విమానాలున్న బిలియనీర్ ను కలవడం తనకు ఆనందాన్ని ఇచ్చిందని చెప్పుకొచ్చింది. మియామీలో తనను కలవాల్సిన వ్యాపారవేత్త, పనిమీద లండన్ వెళ్లిపోయాడని, ఇక్కడి నుంచి మరో దేశం వెళ్లేందుకు 'మిస్ ట్రావెల్' సైట్ ను వెతుకుతున్నానని చెబుతోందీ ముద్దుగుమ్మ.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Natalie Wood  Canterbury  Kent  dating site  Miss Travel  travel dating site  

Other Articles