అందగత్తె ‘ఫ్రీ’గా ప్రపంచాన్ని చుట్టేస్తోంది | woman travels world free with online dating site

Woman travels world free with online dating site

Natalie Wood Miss Travel, Miss Travel woman free world tour, Natalie Wood free world tour, dating site Miss Travel Natalie Wood, ఆన్ లైన్ లో డేటింగ్, ప్రపంచమంతా ఫ్రీగా చుట్టేస్తోంది, నటాలీ ఉడ్ ఫ్రీ టూర్, ఫ్రీగా ప్రపంచం చుడుతోంది, తెలుగు వార్తలు, తాజా వార్తలు, latest news, International news

Woman travels world for free with online dating site. Natalie Wood, 30, from Canterbury, Kent, joined dating site Miss Travel, two years ago and has since been flown around the world by strangers she’s never met. The blonde bombshell has travelled to countries including Turkey, Abu Dhabi, Dubai, the Maldives, Australia, Czech Republic, Kuwait, and Miami.

అందగత్తె ‘ఫ్రీ’గా ప్రపంచాన్ని చుట్టేస్తోంది

Posted: 06/27/2016 02:46 PM IST
Woman travels world free with online dating site

జేబులో రూపాయి లేకుంటే బయటికి వెళ్లలేని స్థితిలో మనం ఉంటే.. ఈ బ్యూటీ మాత్రం చేతిలో చిల్లిగవ్వ లేకుండానే ప్రపంచం మొత్తం ఓ రౌండ్ వేస్తోంది. ఎలా అబ్బా అనుకుంటున్నారా? అదే... తన దగ్గర ఉన్న అందం అనే సొత్తును ఉపయోగిస్తోంది. 30 ఏళ్ల నటాలీ ఉడ్ ఈవిడ గురించి ఎంత చెప్పిన తక్కువే. ఒక్క ఐడియాతో ఆమె తన జీవితాన్ని మార్చేసుకోవటమే కాకుండా ఇప్పటిదాకా 80 దేశాలు చుట్టి వచ్చేసింది.

ముందు ఈ భామ ఏ దేశానికి వెళ్లాలనుకుంటుందో సెలక్ట్ చేసుకుని 'మిస్ ట్రావెల్' అనే డేటింగ్ వెబ్ సైట్ లో వివరాలను పొందుపరుస్తోంది. ఆ దేశానికి చెందిన ధనవంతుడిని అందులో పార్టనర్ గా ఎంపిక చేసి అక్కడి నుంచి ప్రతీ రూపాయి రాబడుతుంది. ప్రయాణ ఖర్చులు మొదలు... రిటర్న్ టికెట్ దాకా అంతా వాళ్లే భరిస్తారు. ఖరీదైన హోటళ్లలో ఉండటం, షాపింగ్ చేయటం అంతా ఫ్రీ... ఫ్రీ...

ఇప్పటివరకూ టర్కీ, అబూదాబీ, దుబాయ్, కువైట్, ఆస్ట్రేలియా వంటి ఎన్నో దేశాలు తిరిగిన నటాలీ ప్రస్తుతం మియామీలో ఉంది. తాను ఇప్పటివరకూ 80 మందితో డేటింగ్ చేశానని, దేశాలన్నీ తిరిగి రావాలన్న కోరికతో పాటు ఓ మంచి భర్తను వెతుక్కోవడమే తన లక్ష్యమని చెబుతోంది. తన డేటింగ్ టూర్ ఎంతో సంతోషాన్ని ఇస్తోందని, సంపన్న పురుషులు తన అందానికి ఇట్టే పడిపోతున్నారని, ఇక వారితో లైంగిక బంధం తనకు ఇబ్బందేమీ కావడం లేదని చెబుతోంది.

దాదాపు కోటి రూపాయలకు పైగానే తనతో డేటింగ్ కోసం బాయ్ ఫ్రెండ్స్ అంతా ఖర్చు చేసి ఉంటారని ఆమె చెబుతోంది. కువైట్ లో ఓ ఇంటర్నేషనల్ అకౌంటెంట్, ఆస్ట్రేలియాలో ఎన్నో సొంత విమానాలున్న బిలియనీర్ ను కలవడం తనకు ఆనందాన్ని ఇచ్చిందని చెప్పుకొచ్చింది. మియామీలో తనను కలవాల్సిన వ్యాపారవేత్త, పనిమీద లండన్ వెళ్లిపోయాడంట. దీంతో మరో దేశం, మరో రిచ్చెస్ట్ వ్యక్తి కోసం వెతికే పనిలో ఉందంట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Natalie Wood  Miss Travel  dating site  free world tour  

Other Articles