ఎయిర్ హోస్టస్ తో ఒక్కసారి... అంటూ వేధించాడు | Man molesting air hostess for selfie and arrested

Man molesting air hostess for selfie and arrested

Air hostess molesting, man forces air hostess for selfie, Air hostess molesting for selfie, సెల్ఫీ కోసం ఎయిర్ హెస్టెస్ ను లాగాడు, ఎయిర్ హెస్టెస్ చెయ్యి పట్టి లాగాడు, తాజా వార్తలు, airhostess harrased

A man from Gujarat was arrested on Monday for molesting a Jet Airways air hostess and taking a selfie against her will.

ఎయిర్ హోస్టెస్ తో ఒక్కసారి... అంటూ వెంటపడ్డాడు

Posted: 06/28/2016 09:30 AM IST
Man molesting air hostess for selfie and arrested

మహిళలపై వేధింపులకు ఎల్లలు లేవన్న విషయం తరచూ మన స్పృహలోకి వస్తున్నాయి. రాత్రి పగలు, ఇంట్లో బయట ఎక్కడైనా సరే ఆకతాయిలు తలుచుకుంటే మహిళల భద్రత ప్రశ్నార్థకమే. తాజాగా ఓ ఎయిర్ హోస్టెస్ ఫ్లైట్లో పైగా ప్రయాణికులు అంతా చూస్తుండగానే వేధింపులకు గురైంది. చెయ్యి పట్టి లాగడమే కాదు, విమానంలోనే సిగరెట్ తాగి బుకయ్యాడు.

తనతో సెల్పీ దిగాలంటూ ఓ యువకుడు ఆమె వెంటపడి అల్లరి చేశాడు. వివరాళ్లోకి వెళ్లితే... దమామ్ నుంచి ముంబై వెళ్తున్న జెట్ ఎయిర్ విమానంలో ముంబై వస్తున్న మొహమ్మద్ అబూబకర్(29) ఎయిర్ హోస్టెస్‌తో సెల్ఫీ దిగాలనుకున్నాడు. ఇందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఆమె వెనకాలే వచ్చి వేధించసాగాడు. దీంతో నివ్వెరపోయిన ఆమె ఒక్కసారిగా కేకలు వేయడంతో క్రూ సిబ్బంది రంగంలోకి దిగారు. అయితే వారిని చూసిన అబూబకర్ వెంటనే టాయిలెట్‌లోకి వెళ్లి సిగరెట్ కాల్చి బయటకు వచ్చాడు.

అతగాడి వ్యవహారంతో విస్తూ పోయిన సిబ్బంది, ఎయిర్ హోస్టెస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ముంబై పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. అయితే సెక్యూరిటీ చెక్‌ను తప్పించుకుని అబూబకర్ విమానంలోకి సిగరెట్, లైటర్ ఎలా తీసుకురాగలిగాడన్న విషయంపై దర్యాప్తు జరపనున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా నిందితుడు అబూబకర్ గుజరాత్ వాసి అని సౌదీ అరేబియాలోని దమామ్‌లో ఓ హోటల్‌లో పనిచేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. విమానంలో అందమైన ఎయిర్ హోస్టెస్ తో సెల్పీ దిగాలన్న అతగాడి కోరిక తీరకుండా పోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : air hostess  gujarath man  selfie  molesting  

Other Articles