Girl commits suicide after morphed pics appear on Facebook, Bribed cops but they did not help, allegess father

Morphing nude photos of chemistry graduate pushes to suicide

Morphed pictures, morphed nude photos, fake nude photos, Facebook, Viral, Girl commits suicide, chemistry graduate suicide, Salem girl fake nude photos, Elampillai,

A 21-year-old girl from Salem committed suicide on Monday after her morphed nude pictures were uploaded on Facebook with her father’s phone number last week.

ఆ బుక్ లో యువతి మార్ఫింగ్ (నగ్న)ఫోటోలు..

Posted: 06/28/2016 03:00 PM IST
Morphing nude photos of chemistry graduate pushes to suicide

ప్రస్తుతం అన్నింటికంటే ప్రభావితమైనది, ప్రభావితం చేస్తున్నది మాత్రం సోషల్ మీడియానే. ఇక ఈ తరం యువతీ యువకులకు అది లేకపోతే పూట గడవటం కూడా కష్టమే. అదే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం కాస్తా నిండు ప్రాణాలను బలిగొంటుంది. ప్రేమ పేరుతో ఇప్పటి వరకు అనేక మంది నమ్మించి నట్టేట ముంచిన ఫేస్ బుక్.. తాజాగా మరో అమ్మాయి ప్రాణాన్ని బలితీసుకుంది. దీంతో తమిళనాడులో సాలెం జిల్లాలో విషాధఛాయలు అలుముకున్నాయి. ఓ గుర్తు తెలియని అకతాయి అమెపై ఎందుకలాంటి చర్యను చేపట్టాడో తెలియదు కానీ.. 21 ఏళ్ల యువతి ఉసురు తీశాడు.

కెమిస్ట్రీలో గ్రాడ్యూయేషన్ పూర్తి చేసిన యువతి బలవన్మరణానికి పోలీసులు కూడా కారణభూతులయ్యారు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగా అమె తనవు చాలించింది.  ఫేస్బుక్లో ఆమె ఫేస్తో నఖిలీ నగ్న చిత్రాలు పోస్ట్ చేయడంతో అమె పోలీసులకు పిర్యాదు చేసింది. వారి నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అమెకు సంబంధించిన మరో నకిలీ నగ్న ఫోటోలు షేస్ బుక్ లో చక్కర్లు కోట్టడంతో తీవ్ర మనోవేధనకు గురైన యువతి అవమానం భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. సాలెం జిల్లాలోని ఎలంపిల్లాయ్లో ఈ ఘటన చోటుచేసుకుంది.

గత వారం ఆమె స్నేహితులు ఫోన్ చేసి ఫేస్ బుక్లో మార్పింగ్ చేసిన తన నగ్న చిత్రాలు ఉన్నాయని చెప్పడంతో బాధితురాలు తండ్రితో కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు వేగంగా పూర్తి చేసేందుకు పోలీసుకు తండ్రి ఒక కొత్త ఫోన్ కూడా కొన్నాడు. అయినా పట్టించుకోకపోవడంతో ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. దీంతో ఎస్పీ అదేశాల మేరకు బాలిక ఇచ్చిన ప్రాథమిక సమాచారంతో ఓ వ్యక్తిని పిలిచి దర్యాప్తు చేశారు. అతడు కాదని నిర్ధారించారు.

దీంతో పదిహేను రోజుల్లోగా అతడిని పట్టుకుంటామని హామీ ఇచ్చి ఇంటికి పంపించారు. అయితే, మరోసారి అదే ఫేస్ బుక్ మరో నగ్న ఫొటోను పోస్ట్ చేయడంతో భరించలేని ఆ బాలిక ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై ఆమె తండ్రి స్పందిస్తూ పోలీసులు వేగంగా స్పందించి ఉంటే తన కూతురు బతికి ఉండేదని బోరుమన్నాడు. నిందితుడిని అరెస్టు చేసే వరకు తమ కుమార్తె మృతదేహాన్ని తీసుకెళ్లబోమని మృతురాలి తల్లిదండ్రులు, బంధువలు అస్పత్రి వద్ద ధర్నాకు దిగారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : girl suicide  morphed nude pictures  face book  fake nude photos  

Other Articles