బాంబు పేల్చిన బ్రెగ్జిట్ ఉద్యమ సారధి | Nigel Farage resigns as Ukip leader

Nigel farage resigns as ukip leader

Nigel Farage, Nigel Farage UKip leader, Nigel Farage britain

Nigel Farage has resigned as Ukip leader after his success in the EU referendum and said: "I want my life back". The Ukip leader said "I feel I have done my bit" and "couldn't possibly achieve more" than he did in the EU referendum.

బాంబు పేల్చిన బ్రెగ్జిట్ ఉద్యమ సారధి

Posted: 07/04/2016 06:34 PM IST
Nigel farage resigns as ukip leader

బ్రెగ్జిట్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, విజయవంతం అయిన ఉద్యమ సారధి నిగెల్ ఫరాగ్ సంచలన ప్రకటన చేశారు. తాను ఇక నిష్క్రమించబోతున్నానని ప్రకటించాడు. సెంట్రల్ లండన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించాడు. బ్రిటన్ స్వతంత్ర్యదేశంగా ఉండాలన్నది తన లక్ష్యమని, దీంతో యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోవాలని కోరుతూ 20 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేశానని అన్నారు. బ్రెగ్జిట్ రెఫరెండం నెగ్గడంలో యూకే ఇండిపెండెంట్ పార్టీ పాత్ర అద్వితీయమని ఆయన కొనియాడారు.

కర్తవ్యాన్ని తాను సక్రమంగా నిర్వర్తించానని, బ్రెగ్జిట్ విజయం కంటే తాను సాధించగలిగేది ఇంకేమీ ఉండదని పేర్కొన్న ఆయన, ఇక భవిష్యత్ ను చక్కదిద్దాల్సిన బాధ్యత రాజకీయ నాయకులదేనని స్పష్టం చేశారు. 'ఐవాంట్ మై కంట్రీ బ్యాక్' నినాదంతో ఉద్యమించిన ఆయన, ఇప్పుడు 'ఐ వాంట్ మై లైఫ్ బ్యాక్' అంటున్నారు. రాజకీయాలు తన వృత్తి కాదని చెప్పిన ఆయన, యూకేఐపీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నాని ఆయన ప్రకటించారు.

ఈయూ నుంచి బ్రిటన్ పూర్తిగా వేరయ్యేవరకు పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతానని ఆయన తెలిపారు. అంటే ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించినప్పటికీ, మరో రెండేళ్లపాటు పార్లమెంటు సభ్యుడిగా కొనసాగే అవకాశం ఉంది. నిగెల్ ప్రస్తుతానికి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించినప్పటికీ భవిష్యత్ లో ఆయన పార్టీ పగ్గాలు చేపట్టే అవకాశం లేకపోలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : UKip  Nigel Farage  britain  EU  

Other Articles