అధికారంలో ఉన్నవారు ఆ అండతో ఫ్రీగా సకల సౌకర్యాలు అనుభవిస్తుంటారు. అంతేనా ఓ మెట్టు దిగి అవినీతితో అక్రమ సొమ్మును మూటగట్టుకోని విలాసాలవంతమైన జీవితాలను అనుభవిస్తారు. అలాంటి మహానుభావులున్న ఈ భూమ్మీద ఇంకా టూమచ్ నిజాయితీ పరులు ఉన్నారంటే ఒకింత ఆశ్చర్యపోవాల్సిందే... ఆమె పేరు అన్ లేపేజ్... మైనే రాష్ట్ర గవర్నర్ పాల్ లెపేజ్ భార్య. అంటే రాష్ట్రానికి ప్రథమ పౌరురాలు. కానీ, ఆమె ఏం చేస్తుందో చూడండి.
ప్రస్తుతం ఆమె ఇప్పుడు ఓ హోటల్ లో వెయిటర్ గా పని చేస్తోంది. అక్కడికి వచ్చే వారిని నవ్వుతూ పలకరిస్తూ, ఆర్డర్ లు తీసుకోవటంతోపాటు ఎంగిలి ప్లేట్లు ఎత్తుతోంది. ఆమెకు అంత కర్మ ఏంటంటారా? ఆమెకు కారు కొనుక్కోవాలనే కోరిక బలంగా ఉందంట. అదేంటీ గవర్నర్ తలుచుకుంటే కారుకు కొదవ అనుకోవచ్చు. కానీ, ఇక్కడ ఓ ప్ర్యతేకత ఉంది. అమెరికాలోనే అత్యంత అల్ప జీతం తీసుకునే గవర్నర్ గా పాల్ లోపేజ్ రికార్డులోకి ఎక్కారు. ఆయనకు వచ్చేదాంట్లో మెజారిటీ వాటాను దానధర్మాలకు, సేవా కార్యక్రమాలకు ఆయన వినియోగిస్తుంటారంట.
దీంతో తన భర్తకు కారు కొనే స్తోమత లేకపోవటంతోనే తాను ఇలా వెయిటర్ గా పని చేస్తున్నా అంటోంది అన్ లోపేజ్. అంతేకాదు ఆ డబ్బుతోనే కారు కొనాలన్న కోరికను తీర్చుకుంటానని చెబుతోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎలాగో అలా డబ్బు సంపాదించేసి, రాజభోగాలు అనుభవించేద్దాం అనుకునే అధికారుల భార్యలు, వారి కుటుంబ సభ్యులు ఉన్న సమాజంలో ఆదర్శ భావాలతో ఆమె చేస్తున్న పనిని ఎందరిలో స్ఫూర్తి నింపుతుందంటారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more