India's 7.5 per cent growth rate may be overstated: US

American government gives shock to pm modi

India GDP growth, Narendra Modi, India economic reforms, India growth rate, make in India, arun jailtey, barrack obama, modi words government, slow economic growth

US State Department in a report said that the Modi govt has been slow to propose other economic reforms that would match its rhetoric.

ప్రధాని మోడీకి షాకిచ్చిన అగ్రరాజ్యం..!

Posted: 07/06/2016 02:43 PM IST
American government gives shock to pm modi

ప్రధాని నరేంద్రమోడీపై మరోమారు అగ్రరాజ్యం అమెరికా తన నైజాన్ని ప్రదర్శించింది. గుజరాత్ ముఖ్యమంత్రి హోదాలో అయన పెట్టుకున్న అమెరికా వీసాలను అనేక పర్యాయాలు రద్దు చేసిన అమెరికా.. మోడీ మూడు దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేనంత మెజారిటీతో ప్రధాని పగ్గాలను అందుకోగానే వీసాతో పాటు ఆయన రాక కోసం వేచి చూస్తున్నామని సందేశాలను పంపింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రధానిని కలసేందుకు అప్పటి వరకు వున్న నిబంధనలను కూడా తోసిరాజి మరోమారు దేశంలో పర్యటించారు.

అయితే ఒబామా దేశంలో పర్యటించేందుకు రాగా, ప్రోటోకాల్ ను కూడా పక్కనబెట్టిన ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి ఒబామా దంపతులకు స్వాగతం పలికారు. ఆ తరువాత తన అభిమాని రూపోందించిన నరేంద్రమోడీ అనే సువర్ణాక్షరాలతో లిఖించిన సూట్ ను వేసుకుని ఆయన ఒబామాతో కలసి చర్చలు నిర్వహించారు. ఆ సూట్ ఖరీదు సుమారుగా 11 లక్షల రూపాయలని అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగానే మారింది. అంతేకాదు ఒబామాతో చర్చల సందర్భంగా అయన ఛాయ్ పె చర్ఛా కార్యక్రమానికి కూడా తెరతీశారు.

అయితే ఒబామాను కలిసిన ప్రతీసారి ఆయన తన డ్రెస్ లను మార్చేసేవారు. ఒకసారి వేసిన డ్రెస్ ను మరోసారి వేయకుండా చూఃసుకున్నారని కూడా వార్తలు వ్యాపించాయి. దీనిపై కూడా అప్పట్లో విమర్శలు చెలరేగాయి. ఇలా అమెరికాతో దోస్తి కట్టిన ఇరు దేశాల మధ్య దైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చకునేందుకు ప్రధాని చేసిన కృషిని అమెరికా కూడా శ్లాఘించింది. నరేంద్రమోడీ అసాధారణమైన వ్యక్తి అంటూ కీర్తించిన అగ్రరాజ్యం ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించింది. ఏకంగా ప్రధానమంత్రికి షాక్ ఇచ్చింది.

ఇన్నిరోజులు మోదీ ఆర్థిక సంస్కరణలను ఆకాశానికి ఎత్తుతూ వచ్చిన అగ్రరాజ్యం అమెరికా మాట మార్చింది. మోదీ చేపడుతున్న ఆర్థిక సంస్కరణలు ఆశించిన రీతిలో లేవని తేల్చేసింది. భారత్ 7.5 శాతం వృద్ధి రేటు నమోదు చేస్తామని మోదీ చెప్పడం అతిశయోక్తి అని వ్యాఖ్యానించింది. అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన "2016 పెట్టుబడుల వాతావరణ ప్రకటన" నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది. మోదీ చెబుతున్న రీతిలో ఆర్థిక సంస్కరణలు లేవని రిపోర్టులో పేర్కొంది.

గొప్పలు చెప్పుకోవడం మినహా.. లక్ష్యాలను అధిగమించలేకపోతున్నారని తెలిపింది. అయితే విదేశీ పెట్టుబడుల నిబంధనల విషయంలో తీసుకున్న చర్యలు, పాలన ఫర్వాలేదని తన రిపోర్టులో పేర్కొంది. ఇతర ఆర్థిక సంస్కరణలతో పోలిస్తే మోదీ చేపట్టేవి చాలా నెమ్మదిగా ఉన్నాయని అమెరికా వ్యాఖ్యానించింది. ఆర్థిక సంస్కరణల అమలులో మోదీ ప్రభుత్వం విఫలమవుతోందని.. జీఎస్టీ బిల్లుకు రాజకీయ మద్దతుపై ఇంకా చర్చల దశలోనే ఉందని తెలిపింది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థలో భారత్ ఒకటిగా ఉంది. 7.5 శాతం వృద్ధి రేటు నమోదుచేస్తామని చూపించడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీయడమేనని వ్యాఖ్యానించింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India GDP growth  Narendra Modi  India economic reforms  India growth rate  

Other Articles