నవ్యాంధ్రప్రదేశ్ లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం.. ఎన్నికలకు ముందు చెప్పిన మాటలకు.. గెలిచిన తరువాత చేస్తున్నచేష్టలకు ఏమాత్రం పోంతనలేకుండా వుంది. రాజధాని లేని రాష్ట్రం, తెలంగాణ విడిపోవడంతో సానుభూతిని కనబర్చిన ఉద్యోగులు, ఉద్యోగినిలు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి తొలిసారిగా తమతో ఏర్పాటు చేసిన సమావేశంలో నిలువు దోపిడి కూడా ఇచ్చారు. అద్భుతమైన రాజధానితో పాటు అవసరమైన మౌళిక వసతులు కల్పించాలని కోరారు. ఇలా ఉద్యోగుల నుంచి లభించిన మద్దతు.. అంతకుముందు ప్రజల నుంచి లభించిన మద్దతును కూడగట్టుకున్న చంద్రబాబు సర్కార్.. రాజధాని లేదన్న అసలు విషయాన్ని విస్మరించి.. రాష్ట్రానికి పరిశ్రమలను అకర్షించే ఉద్దేశ్యంతో చేపట్టిన విదేశీ పర్యటనలకు రెండు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసుకోవడం.. తమ తాత్కాలిక కార్యాలయాలకు లక్షల రూపాయలతో సోగబులు చేయించుకోవడం ఉద్యోగవర్గాల్లో అగ్రహాన్ని కల్గించిందన్న వార్తలు ఇప్పటికే వెలుగు చూశాయి.
ఇక రాజధాని విషయంలో కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ స్పష్టంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధాని వద్దని సూచనలు చేసింది. విస్తారంగా ప్రభుత్వ భూమి వున్న ప్రాంతంలోనే రాజధానిని నిర్మించాలని, ప్రజల నుంచి వేల ఎకరాల సారవంతమైన భూమిని లాక్కోవడం సహేతుకం కాదని కూడా సూచించింది. సమీప భవిష్యత్తులో అహారధాన్యాల ఉత్పత్తుల విషయంలో కరువు ఏర్పడటానికి కూడా ఇది దోహదం చేస్తుందని భావించింది. అయినా కమిటీ సూచనలను భేఖాతరు చేస్తూ.. తమ నిర్ణయమే ఫైనల్ అన్నట్లుగా రాష్ట్ర సర్కార్ వ్యవహరించింది. కేంద్ర కమిటీ సూచనలను విస్మరించిన ఏపీ సర్కారు.. కృష్టా, గుంటూరు జిల్లాల సరిహద్దులో విజయవాడకు చేరువలోనే రాజధాని నిర్మాణం చేపట్టాలని నిర్ణయించుకుంది. దీంతో క్యాపిటల్ ల్యాండ్ అక్విజిషన్ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేయడం చకచకా జరిగిపోయాయి. ఇలా రాజధాని నిర్మాణానికి పనులు ప్రారంభించిన నాటి నుంచి ఏపీ సర్కార్ అనేక ఇబ్బందులతో పాటు విమర్శలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది.
కాగా, తాజాగా సోషల్ మీడియాలో మరో అసక్తికరమైన చర్చ వైరల్ గా మారుతొంది. రాష్ట్రానికి నిదులు లేమి వుందని ప్రచారం చేసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. అటు కేంద్రం వద్ద ఈ విషయమై అనేక పర్యాయాలు అంగలార్చి.. నీటి అయోగ్ వద్ద ఏకరువు పెట్టి.. కేంద్రమంత్రులతో విడివిడిగా భేటీ అయ్యి సిఫార్సులు చేయించుకుని అనేక నిధులను రాబట్టుకుంటున్నా.. వాటిని సద్వినియోగం చేయకుండా అంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచ్ఛలవిడిగా ఖర్చు చేస్తుందని విమర్శలు గుప్పమంటున్నాయి. ఇవే అరోపణలు సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతున్నాయి. అయితే ఇందుకు ఓ ఉదాహరణ కూడా నెట్ జనులు షేర్ చేసుకోవడం.. చర్చనీయాంశంగా మారింది.
అక్రమాల పునాదుల మీద నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతుందా..? అంటే అవుననే అనుమానాలు వినబడుతున్నాయి. ఇందుకు కారణాలు వున్నాయి. పది లక్షల చదరపు అడుగుల నిర్మాణానికి జరిగిన ఖర్చుతో పొల్చితే.. ఆరు లక్షల చదరపు అడుగుల నిర్మాణానికి ఖర్చు అవుతున్న వ్యయం అంతకు రెండింతలు ఎలా వుంటుందని వాసిరెడ్డి శ్రీనివాస్ పోస్టు చేసిన ఓ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో నెట్ జనుల మదిని తోలుస్తుంది. ఔరా..! అవినీతి లేని సమాజంలో తాను అగ్రసభ్యుడిగా చెప్పుకునే టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు తన హాయంలోనే బాహాటంగా అవినీతికి పాల్పడుతున్నారా.. అంటూ కామెంట్లు వస్తున్నాయి. ఇంతకీ అసలు స్టోరీ ఏంటంటారా...?
టీడీపీ రాజ్యసభ సభ్యుడు, కేంద్రమంత్రి సుజనా చౌదరి తెలుగు ప్రజలకు పరిచయం అవసరం లేని పేరు. బహుశా దేశ ప్రజలకు మాత్రం అయన కేంద్రమంత్రి అయిన తరువాతే పరిచయస్తుడు. అంతుకు ముందుగానే ఆయన మారిషస్ అధికారులకు మాత్రం అత్యంత సుపరిచితుడు. అదేనండి మారిషస్ కమరి్షల్ బ్యాంకు అధికారులు ఆయన నామ జపం చేయకుండా వుండలేరంటే అతిశయోక్తి కాదులేండి. అవునవును.. మీరు ఊహించింది. కరెక్టే. మారిషస్ కమర్షియల్ బ్యాంక్ కు ఆయన సంస్థ వంద కోట్ల రూపాలను ఎగ్గోట్టిందని ప్రస్తుతం బ్యాంకు అధికారులు నాంపల్లి కోర్టు నుంచి దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. వారితో పాటు సుజనా తరపు న్యాయవాదులు కూడా న్యాయస్థానాలను ఆశ్రయించారు. త్వరలోనే ఈ కేసు విషయంలో రాష్ట్రోన్నత న్యాయస్థానంలో విచారణకు రానుంది. ఈ విషయాన్ని పక్కన బెడితే.. ఈ కేంద్రమంత్రికి చెందిన ఓ అత్యంత అధునాత కాంప్లెక్స్ .. అదీనూ పది లక్షల చదరపు అడుగులతో నిర్మితమైన మాల్ నిర్మాణానికి, భూమి కోనుగోలుకు ఖర్చైన విలువపై.. రాజధాని అమరావతిలోని వెలగపూడిలో నిర్మితమవుతున్న భవన నిర్మాణానికి ఖర్చవుతున్న వ్యయాన్ని పోల్చితే చర్చనీయాంశంగా మారింది.
అదెలా అంటే.. కూకట్ పల్లిలోని మలేషియా టౌన్ షిప్ కు ఎదురుగా వున్న పది లక్షల చదరపు అడుగులలో వున్న సుజనా మాల్ కు భూమి కొనుగోలుతో సహా నిర్మాణ వ్యయాలు, ఇంటీరియర్ డెకరేషన్ సహా అన్ని కలిపి 260 కోట్ల రూపాయలు వ్యయం ఖర్చైందని, అయితే వెలగపూడిలో రైతుల నుంచి లాండ్ పుల్లింగ్ ద్వారా తీసుకున్న ఆరు లక్షల చదరపు అడుగుల భూమిలో నిర్మితమవుతున్న భవనానాకి 750 కోట్ల రూపాయాలను వ్యయమవుతుందన్న అంచనాలు నెట్ జనులను విస్మయానికి గురిచేస్తున్నాయి. వాసిరెడ్డి శ్రీనివాస్ ఫోస్టు చేసిన ఈ వ్యాసాన్ని నెట్ జనులు షేర్ చేసుకుంటూ చర్చనీయాంశంగా మారుస్తున్నారు.
హైదరాబాద్ లోని పది లక్షల చదరపు అడుగుల ఫోరం సుజనా మాల్ నిర్మాణానికి 260 కోట్ల రూపాయలు అయితే..వెలగపూడిలో కేవలం ‘ఆరు లక్షల’ చదరపు అడుగులు నిర్మాణానికి 750 కోట్ల రూపాయలు ఎలా అవుతాయి?. అన్న ప్రశ్నలు నెట్ జనులకు అనుమానాలు రేకెత్తించేలా చేస్తున్నాయి. అయితే ఇక్కడ తెరపైకి మరో అంశం వచ్చింది. హైదరాబాద్ తో పోలిస్తే వెలగపూడి లో లూజ్ సాయిల్…కాబట్టి పైల్ ఫౌండేషన్ వేయాలి. దీని వల్ల కాస్త వ్యయం ఎక్కువే అవుతుందన్న వాదనలు వినబడుతున్నాయి. దీనికి హైదరాబాద్ అందులోనూ గజం స్థలం రెండు లక్షల రూపాయల చేరి ప్రభుత్వాలనే విస్మయానికి గురిచేసిన ప్రాంతంలో పది లక్షల చదరపు అడుగుల స్థలం కోనుగోలు ఎంత ఖర్చు అవుతుందో సామాన్యులు కూడా అంచనా వేసుకోవచ్చు. అలాంటి నేపథ్యంలో భూమి కొనుగోలు అయిన వ్యయం పైల్ ఫౌండేషన్ కు సరిపోతుందని మరి మిగిలిన డబ్బును ఏమంతుందన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
ఇక్కడ మరో వాదన కూడా తెరపైకి వస్తుంది. సుజనా ఫోరం మాల్ నిర్మాణం ప్రారంభమై రమారమి అరేడేళ్లు కావస్తుందని, అప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్మాణ వ్యయాలు పెరగలేదా..? భవన నిర్మాణ ఖర్చు కూడా పెరుగుతుందని అన్నింటి అంచనా వేసుకోవాలన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే పదివేల చదరపు అడుగుల నిర్మాణానికి, ఆరువేల చదరపు అడుగుల నిర్మాణానికి వ్యత్యాసం చాలా వుందని, నాలుగు వేల చదరపు అడుగుల నిర్మాణ వత్యాసాన్ని భవన నిర్మాణ వత్యాసాలకు, ఇత్యాదులకు ఖర్చుచేసినా.. అధికంగా ఎందుకు ఖర్చుపెడుతున్నారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అంతకాకపోతే మరో 150 కోట్ల రూపాయలు అధికంగా ఖర్చుఅవుతాయని, అలా కాకుండా రెండు, మూడింతలకు నిర్మాణ వ్యయాలు ఎలా పెరుతాయన్న ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఇదేనా చంద్రబాబు మార్క్ అభివృద్ది అని కామెంట్లు వస్తున్నాయి. అత్యవసరం అని చెప్పి టెండర్ లో పేర్కొన్న దానికంటే ఎక్కువ మొత్తం ఇవ్వటానికి సర్కారు ఆమోదించమేంటని కూడా నెట్ జనులు ప్రశ్నిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more