సోషల్ మీడియాకు ఎంత దూరంగా వుంటే అంత మంచిదని తెలిసివచ్చింది ఓ బాలుడికి. అదేంటి అంటారా.? నిజమండీ.. సోషల్ మీడియా ఎంతటి వారినైనా తన కబంధ హస్తాలలోకి లాక్కుని తాత్కాలిక సుఖాలను అందిస్తుంది. వాటిని అస్వాధించే లోపే కష్టాలను తెచ్చిపెడుతుంది. అయితే కేవలం తమ పని తాము చూసుకుంటామనుకున్న వారికి మాత్రం సామాజిక మాద్యమం మిత్రడే. అయితే చెడు సావాసాలు చేసేవారికి మాత్రం ఇదో నరకం అని కొద్దిగా అలస్యంగానైనా తెలుస్తుంది. అదెలా అంటారా..?
నిత్యం ఫేస్బుక్లో మునిగిపోయే ఓ 17 ఏళ్ల బాలుడికి అనుకోకుండా ఓ మహిళతో పరిచయమైంది. ఫేస్బుక్లో 'జిందా' పేరుతో ఉన్న 26 ఏళ్ల మహిళతో చాటింగ్ లో మునిగి తేలుతూ పరిచయం పెంచుకున్నాడు. ప్రతిరోజు అమెతో చాటింగ్ చేసి చేసి క్రమంగా ఫేస్ బుక్ దాటి పరిచయాలు బలపడ్డాయి. అయితే తనతో ఏకాంతంగా గడపటానికి రావాలని ఆ బాలుడ్ని మహిళ కోరింది. దీంతో యువకుడు ముందువెనుక అలోచించకుండా వచ్చి చిక్కులు కొనితెచ్చుకున్నాడు. అదెలా అంటే వారు మైమరచి ఒకరి కౌగిలిలో మరోకరు బంధీలుగా మారిన తరుణంలో అక్కడికి పోలీసులు వచ్చారు.
పోలీసులకు సమాచారం అందడంతోనే వారు అక్కడికి వచ్చారు. వారికి సమాచారం ఇచ్చిందెవరు..? అంటే జిందా అనే మహిళ. ఓ 17 ఏళ్ల యువకుడు తనపై అత్యాచారం చేశాడని అమె పోలీసులకు తన ఫోన్ ద్వారా పిర్యాదు చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకుని బాలుడిని అరెస్టు చేశారు. అయితే సదరు మహిళ తనను రమ్మని బలవంతం చేయడంతోనే తాను హోటల్ లోకి వచ్చానని, తానే బలవంతంగా శారీరికంగా ఒక్కటవుదామని బలవంతం చేసిందని బాలుడు పోలీసులకు చెప్పాడు. తాను తిరస్కరించినా పదేపదే అడగడంతో కాదనలేక వచ్చానని పోలీసులతో బాలుడు చెప్పాడు.
ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలోని ఓ హోటళ్లో జరిగిన ఈ ఘటన.. టీవీలో క్రైమ్ డ్రామాను మరిపించేలా ఉందని పోలీసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఏకాంతంగా గడుపుతున్న సమయంలో ఆమె హఠాత్తుగా పోలీసులకు ఫోన్ చేసింది. తనపై అతడు అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలుడిపై అత్యాచారం కింద, మహిళపై 'పోస్కో' చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. ఇదంతా 'హనీట్రాపింగ్'లో భాగమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more