దేశ రాజధాని ఢిల్లీకి మూడేళ్లపాటు ముఖ్యమంత్రిగా పని చేసిన షీలా దీక్షిత్ వైపే హస్తం మొగ్గు చూపింది. వచ్చే ఏడాది ఉత్తర ప్రదేశ్ ఎన్నికల కోసం కాంగ్రెస్ అభ్యర్థిగా షీలా దీక్షిత్ పేరును సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ ప్రకటించనున్నారు. మొదట్లో బరిలో నిలిచేందుకు షీలా నిరాకరించినా.. సీనియర్ నేతల ఒత్తిడి మేరకు అంగీకరించినట్లు సమాచారం. ఏఐసీసీ సీనియర్ నేత జనార్దన్ ద్వివేది కూడా ఆమె అభ్యర్థిత్వాన్ని దృవీకరిస్తూ మీడియాకు తెలిపారు.
'నేను ఉత్తరప్రదేశ్ కోడలిని. రాజకీయాల్లో పదవీ విరమణ అంటూ ఉండదు' అని దీక్షిత్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. యూపీ సవాల్ చాలా పెద్దది. కానీ, విజయం పై ధీమాతో ముందుకెళ్తున్నాం... ప్రియాంకగాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనటం సంతోషంగా ఉంది అంటూ ఆమె ప్రకటించింది. అయితే అసోం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీ మాజీ ఎంపీ సంజరు సింగ్ ఎన్నికల ప్రచార కమిటీలో కీలకపాత్ర పోషించనున్నట్టు తెలుస్తోంది.
కాగా ఇదిలా ఉండగానే ఏసీబీ ఆమెకు సమన్లు జారీ చేయటం చర్చనీయాంశంగా మారింది. షీలా దీక్షిత్ ఢిల్లీ సీఎంగా ఉన్న సమయంలో వాటర్ బోర్డు చైర్మన్ గా ఉన్నారు. ఆ సమయంలో ఢిల్లీ వాటర్ బోర్డులో అవినీతి చోటు చేసుకుంది. దీనిపై ఆమ్ ఆద్మీ సర్కార్ విచారణకు ఆదేశించింది. కోట్లాది రూపాయల వాటర్ ట్యాంక్ కుంభకోణంలో షీలాకు నోటీసులు జారీ చేశామని, ఆమెను ఆగస్టు 26న తమ ఎదుట హాజరు కావాల్సిందిగా కోరామని ఏసీబీ చీఫ్ ఎమ్ కే మీనా తెలిపారు.దీనిపై స్పందించిన షీలా ఏసీబీ నుంచి తనకు నోటీసులు అందాయని ధృవీకరించారు.
ఇక ఆమె సీఎం అభ్యర్థిత్వంపై సోషల్ మీడియాలో అప్పుడే జోకులు పేలటం మొదలైంది. ప్రముఖ నటుడిని దర్శకుడిగా చేసి, రాజకీయ వేత్తగా నటిగా చేసి కాంగ్రెస్ యూపీ రాజకీయాలను నడిపించబోతుందని కొందరు, ఏసీబీని పావుగా వాడి ఆమెను ఆడుకోబోతున్నారని, యూపీ ఓటమికి షీలాను బాధ్యురాలిని చేయబోతున్నారని మరికొందరు చమక్కులు పేలుస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more