టెక్కీ స్వాతి హత్య కేసులో నిందితుడు రామ్ కుమార్ ఎట్టకేలకు నేరాన్ని ఒప్పుకున్నాడు. ప్రేమించి మోసం చేసిందనందుకే చంపానని పోలీసుల ముందు వాంగ్మూలం ఇచ్చాడు. స్వాతితో తనకు పరిచయం ఎలా ఏర్పడిందీ, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, చివరకు ఎలా హత్య చేశాడో మొత్తం వివరాలను పోలీసులకు విచారణలో వెల్లడించాడు...
బీఈ ఫెయిలైన తాను సంపాదన కోసం చెన్నై వచ్చాననీ, ఆ సమయంలో సూర్యప్రకాశ్ అనే స్నేహితుడి ద్వారా స్వాతితో పరిచయమేర్పడిందని చెప్పాడు. స్వాతి తనతో చాలాక్లోజ్‌గా ఉండేదనీ, రోజుల తరబడి ఆమెతో ఫోన్ లో మాట్లాడనని, ఆమెను గాఢంగా ప్రేమించానని తెలిపాడు. తాను ప్రైవేట్ సంస్థలో కంప్యూటర్ ఇంజనీర్‌గా నెలకు లక్షరూపాయలు సంపాదిస్తున్నట్లు తెలిపానని, ఆ తర్వాత స్వాతి తనతో సెల్ఫోన్లో మాట్లాడేదనీ, ఆమెకోసమే తాను చూళైమేడు మేన్షన్‌లో అద్దెకు దిగానని చెప్పాడు. చూళైమేడులోని గుడికి తామిద్దరం కలిసి చాలాసార్లు వెళ్లామని, ఆ తర్వాత తాను బట్టల దుకాణంలో చేరి సంపాదించిన జీతంతో పాటు ఊరి నుంచి తల్లిదండ్రులు పంపే డబ్బుని స్వాతి కోసమే ఖర్చు చేశానని వివరించాడు.
తన బట్టల దుకాణంలోని కొత్త డిజైన్ బట్టలు వేసుకుని వెళ్తుండంతో ఆమె తనను ఓ ధనవంతుడి బిడ్డగా భావించిందనీ, అప్పటి వరకూ సాఫీగా కొనసాగిన తమ స్నేహంలో ఓ రోజు స్వాతి తాను బట్టల దుకాణంలో పని చేస్తుండగా చూడటంతో మనస్పర్థలు ఏర్పడ్డాయని, ఆ తర్వాత ఆమె తనను దుర్భాలాషలాడిందనీ, సాఫ్ట్వేర్ఇంజనీర్ అనీ, లక్ష రూపాయల జీతమని తనతో ఎందుకు అబద్ధాలు చెప్పావంటూ కోపగించుకుందని రామ్‌కుమార్ పోలీసుల విచారణలో తెలిపాడు.చివరకు తనతో మాట్లాడటం మానివేసిందనీ, అప్పటి నుంచి ఆమెపై తాను కక్ష పెంచుకుని, తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతోనే ఆమెకు సరైన గుణపాఠం నేర్పానని రామ్‌కుమార్ తెలిపాడు.
గురువారం స్వాతి స్నేహితుడైన ట్రిప్లికేన్ ప్రాంతానికి చెందిన బిలాల్ మాలిక్‌ను కూడా పోలీసులు విచారిస్తున్నారు. నుంగంబాక్కం పోలీసుస్టేషన్‌కు బైకులో వెళ్లిన బిలాల్ మాలిక్ పరిసరాల్లో మీడియా హడావుడి చూసి హెల్మెట్ తోనే స్టేషన్‌లోపలకు వెళ్లిపోయాడు. తనను ఓ యువకుడు తరచూ వెంబడిస్తున్నాడంటూ స్వాతి తనకు పలుమార్లు తెలిపిందని స్వాతితో పాటు పనిచేసిన మాలిక్ హత్య జరిగిన వెంటనే పోలీసుల వద్దకు వెళ్లి వాంగ్మూలమిచ్చాడు. ప్రస్తుతం తమ కస్టడీలోకి తీసుకున్న రామ్‌కుమార్ వద్ద జరుపుతున్న విచారణలో భాగంగానే పోలీసులు మాలిక్‌ను పిలిపించారని తెలుస్తోంది. స్వాతి తనను వెంబడించిన యువకుడి రూపు రేఖలేవైనా మాలిక్‌కు చెప్పిందా అని పోలీసులు ప్రశ్నించారనీ, స్వాతి చెప్పిన ఆనవాళ్ల ప్రకారం రామ్‌కుమార్ ఉన్నాడా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవడానికే పోలీసులు అతడిని రప్పించారని చెబుతున్నారు.
ఎగ్మూరు కోర్టు ఆదేశాల మేరకు రామ్‌కుమార్‌ను మూడు రోజుల కస్టడీకి తీసుకున్న నుంగంబాక్కం పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్ళి విచారణ జరుపుతున్నారు.ఇప్పటిదాకా మధ్యవర్తి అయిన సూర్యప్రకాశ్ గురించి ఆచూకీ కనిపెట్టకపోవటం గమనార్హం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more