కేంద్రం ఆఫర్ కి కేసీఆర్ నో! | KCR govt set to build power plants against Centre's advice

Kcr govt set to build power plants against centre s advice

Telangana new thermal plants, Piyush Goel on Telangana new thermal plants, KCR ignore central acvice in Telangana new thermal plants

Telangana govt set to build power plants against Centre's advice. KCR not interested on Piyush Goel proposal.

కేంద్రం ఆఫర్ కి కేసీఆర్ నో!

Posted: 07/15/2016 12:00 PM IST
Kcr govt set to build power plants against centre s advice

విభజన తర్వాత తీవ్ర విద్యుత్ కొరతతో అల్లాడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పుడు సొంతంగా కరెంట్ తయారు చేసుకునే స్థాయికి చేర్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. పొరుగు రాష్ట్రాల నుంచి కరెంట్ ను కోనుగోలు చేసి
క్రమంగా ఇక్కడి ఉత్పాదకతను పెంచి స్వయంసమృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారు. ఇది మంచి పరిణామమే అయినప్పటికీ సమీప భవిష్యత్తులో కొత్త ప్రాజెక్టులతో భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవనే వాదన
వినిపిస్తోంది.

ఈ విషయం చెబుతుంది ఎవరో కాదు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. శాశ్వత విద్యుత్ కొరత నివారణ దిశగా అడుగులు వేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం... కొత్తగా రెండు ధర్మల్ పవర్ ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లా మణుగూరులో 1,080 వేల మెగావాట్ల సామర్థ్యంతో ఓ ప్రాజెక్టు, నల్లగొండ జిల్లా దామరచర్లలో 4 వేల మెగావాట్ల సామర్థ్యంలో మరో ప్రాజెక్టుకు త్వరలో పనులు ప్రారంభించనున్నారు. అయితే ఈ రెండు ప్రాజెక్టులకు అవసరమైన బొగ్గు లభ్యత సమీప భవిష్యత్తులో కనిపించడం లేదు. దీంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బొగ్గు ద్వారా ఈ ప్రాజెక్టుల్లో విద్యుదుత్పాదనకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అంతేకాకుండా ఈ ప్రాజెక్టుల కారణంగా భారీ ఎత్తున కాలుష్యం తప్పదని పర్యావరణవేత్తలు హెచ్చస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణాన్ని విరమించుకోవాలని బుధవారం మెదక్ విచ్చేసిన ఇంధన శాఖ మంత్రి పీయూష్ గోయల్ సూచించారు.

ఈ రెండు ప్రాజెక్టులను రద్దు కోసం తెలంగాణ ప్రభుత్వం ముందుకు వస్తే ఆ లోటును తాము పూడుస్తామని, అతి తక్కువ ధరకే అందిస్తామని ఆయన ప్రకటించాడు కూడా. రామగుండంలో నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ కేంద్రానికి గాను ఇప్పటికే 800X2 చొప్పున 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పనులు ప్రారంభించిందని, ఇవే గాక ఇప్పటికే ఎన్టీపీసీ, రాష్ట్రం మధ్య విద్యుత్ ఉత్పాదకత పెంచేలా చర్యలు కొనసాగుతున్నాయని ఆయన వివరించారు. ఈ సమయంలో కొత్త ప్రాజెక్టులు అసలు అవసరం లేదనేది ఆయన వాదన.

అయితే గోయల్ ప్రతిపాదనను పెడచెవిన పెట్టిన తెలంగాణ సర్కారు తానునకున్న మార్గంలో ముందుకెళ్లేందుకే సిద్ధమైంది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో భూసేకరణతోపాటు, అవసరమైన పనులకు సమీక్షించాలని అధికారులకు ఉత్తర్వులు అందాయంట. ప్రస్తుతం ఈ వ్యవహారంపై జాతీయ మీడియాలో సైతం కథనాలు వెలువడుతుండటం విశేషం.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  KCR  Union Minister  Piyush Goel  thermal plants  

Other Articles