గోల్డ్ మాన్ దత్తాత్రేయను హత్య చేశారు | Goldman Dattatrey Phuge brutally murdered

Pune goldman dattatrey phuge brutally murdered

Goldman Dattatrey Phuge, Goldman killed, Pune Goldman Dattatrey Phuge, Pune Goldman murdered

Goldman Dattatrey Phuge brutally murdered. Pune based business man killed by relatives due to financial issues.

గోల్డ్ మాన్ దత్తాత్రేయను హత్య చేశారు

Posted: 07/15/2016 01:12 PM IST
Pune goldman dattatrey phuge brutally murdered

‘గోల్డ్ మ్యాన్’ దత్తాత్రేయ గుర్తున్నాడా? 1.2 కోట్లు ఖర్చుపెట్టి 22 క్యారెట్ల బంగారంతో తయారు చేయించుకున్న 3.5 కేజీల బరువున్న చొక్కాను ధరించి వార్తల్లో కెక్కాడు. అన్ని వేళ్లకు ఉంగరాలు, మెడ నిండా బంగారు గొలుసులతో దర్శనమిచ్చిన అప్పట్లో అబ్చురపరిచిన ఈ పుణె కు చెందిన వ్యాపారవేత్త శుక్రవారం హత్య గావించబడ్డాడు.

సిటీకి సమీపంలోని దిఘీలో హత్యకు గురయిన ఆయన శవాన్ని పోలీసులు కనుగొన్నారు. గురువారం రాత్రి కొందరు వ్యక్తులు తమ ఇంటికి వచ్చి తన భర్తను తీసుకువెళ్లారని దత్తా త్రేయ భార్య సీమ చెబుతున్నారు. భరతమాతనగర్ కు తీసుకువెళ్లిన వారు తన భర్తపై రాళ్లతో, ఆయుధాలతో దాడి చేసి హత మార్చారని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మాజీ కార్పొరేటర్ అయిన ఆమె ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి నలుగురు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో దత్తాత్రేయ మేనల్లుడు కూడా ఉండటం విశేషం.

కాగా, దత్తాత్రేయ చిట్ ఫండ్ కంపెనీని ఏర్పాటు చేశారని, చాలా మంది ఇన్వెస్టర్ల నుంచి డబ్బు సేకరించారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయని, ఇన్వెస్టర్లతో ఘర్షణ పడిన సందర్భాలు కూడా ఉన్నాయని, ఆయనపై క్రిమినల్ కేసు నమోదయ్యాయని పోలీసులు చెబుతున్నారు.
 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pune  Goldman  Dattatrey Phuge  murder  

Other Articles