Petrol prices slashed by Rs 2.25, diesel by Rs 0.42 paise

Petrol diesel prices cut

Petrol price,Diesel price,IOC,Bharat Petroleum,Hindustan Petroleum,Forex,Oil price, Petrol, Petrol price cut, Diesel price cut, Diesel prices in India, Petrol prices in India

Much to the relief of commuters, the government today announced that the price of petrol will be cut by Rs 2.25 paise and diesel by Rs 0.42 paise.

వాహనదారులకు స్వల్ప ఊరట. తగ్గిన పెట్రోధరలు..

Posted: 07/16/2016 07:07 AM IST
Petrol diesel prices cut

వాహనదారులకు ఇంధన సంస్థలు కాస్తా ఊరటనిచ్చాయి. అంతర్జాతీయంగా చమురు దరలు నేల చూపులు చూస్తున్న తరుణంలో ఇంధన సంస్థలు కూడా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాయి. పెట్రో ధరలు తగ్గిస్తూ ఇంధన సంస్థలు తీసుకున్న నిర్ణయానికి కేంద్రం నుంచి అనుమతి లభించడంతో ఈ మేరకు ఇంధన ధరలను తగ్గిస్తూ చమురు సంస్థలు ప్రకటనను వెలువరించాయి. తగ్గింపు ధరల గత అర్థరాత్రి నుంచే అమల్లోకి వచ్చినట్లు కూడా ఇంధన సంస్థలు వెలువరించాయి.

లీటరు పెట్రోల్‌పై రూ. 2.25 తగ్గించిన ఇంధన సంస్థలు, అహార ద్రవ్యోల్భణానికి ఇక కారణంగా నిలచే డీజిల్‌పై మాత్రం స్వల్పంగా ధర తగ్గించింది. లీటరు డీజిల్‌పై 42 పైసలు తగ్గిస్తూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఇంధన ధరలను పెంచేప్పుడు అమాంతం ధరలను పెంచే ఇంధన సంస్థలు.. ఈ నెలలో మాత్రం ముందుగా స్వల్పంగా ధరను తగ్గించారు. కాగా ఈ పక్షం మాత్రం పెట్రోల్ వాహనదారులకు కాస్తా ఊరటనిచ్చేలా ధరను తగ్గించారు. అయితే ఇంధన ధరలు తగ్గిన ప్రతీసారి కేంద్రం వెనువెంటనే స్పందించి ఇంధన దరలపై ఎకైజ్ పన్ను విధంచడం కూడా పరిపాటిగా మారింది. దీంతో ఈ సారి కూడా అలాంటి నిర్ణయాలను తీసుకుంటుందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి.

యూపిఏ ప్రభుత్వం పెట్రోల్ సబ్సీడీపై నియంత్రణను ఎత్తివేయడంతో పెట్రోల్ దరలను, ఆ తరువాత నరేంద్రమోడీ హయాంలోని ప్రభుత్వం డీజిల్ పై నియంత్రణను ఎత్తివేయడంతో గత రెండేళ్ల కాలం నుంచి డీజిల్ ధరల నియంత్రణను ఇంధన సంస్థలు పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా పక్షం రోజులకు ఒక పర్యాయం ఇంధన సంస్థలు చర్చించి ధరల హెచ్చుతగ్గులను పర్యవేక్షిస్తుంటాయి. కాగా వీటిని ప్రకటించేందుకు మాత్రం కేంద్ర ఇంధనశాఖ అనుమతి తప్పనిసరి.  రెండోసారి ధరల్ని తగ్గించారు. తగ్గిన ధరలు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 64.76 గా ఉండగా తగ్గిన ధరతో రూ. 62.51కి చేరింది. ఇక డీజిల్ ధర రూ. 54.70గా ఉండగా 42 పైసలు తగ్గి రూ.54.28కి చేరింది. జూలై 1న పెట్రోల్‌పై 89 పైసలు, డీజిల్‌పై 49 పైసలు తగ్గించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Petrol  Diesel  price cut  ioc  bharat petroleum  hindustan petroleum  

Other Articles