గత దశాబ్దకాలంలో భారతీయులు ఎవరి కోసం, దేని కోసం వెతికారో తెలుపుతూ గూగుల్ ఓ నివేదికను విడుదల చేసింది. సెలబ్రిటీల జాబితాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, శృంగార తార సన్నీ లియోన్ లకు అభిమానుల్లో అంతులేని ఆదరణ ఉందని గూగుల్ ప్రకటించింది. నటులు, నటీమణులు, సింగర్, డ్యాన్సర్, డైరక్టర్, సెలబ్రిటీలు ఇలా వివిధ విభాగాల్లో ఎవరి గురించి ఎక్కువగా సెర్చ్ చేశారనే దానిపై ఈ జాబితాను విడుదల చేసింది.
గత పదేళ్లలో సన్నీ లియోన్ హాట్ వీడియోల కోసం నెటిజన్లు తెగవెతికారని తెలిపింది. ఆ తరువాతి స్థానంలో సల్మాన్ ఖాన్ నిలిచాడని తెలిపింది. హాట్ వీడియోలను తప్పిస్తే సల్మాన్ ఖానే బాలీవుడ్ రారాజని, అతని గురించే ఎక్కువ మంది నెటిజన్లు సెర్చ్ చేశారని తెలిపింది.
సల్మాన్ తరువాత, షారుక్ ఖాన్ రెండో స్థానంలో, అక్షయ్ కుమార్ మూడో స్థానంలో నిలవగా, బిగ్ బీ అమితాబ్ నాలుగో స్థానంలో నిలిచారు. సౌత్ సూపర్ స్టార్ రజనీ కాంత్ ఐదో ఫ్లేస్ లో ఉండగా, హృతిక్ రోషన్, షాహిద్ కపూర్, రణ్‌బీర్ కపూర్, ఆమిర్ ఖాన్, ఇమ్రాన్ హష్మీలు తర్వాతి స్థానాల్లో నిలిచారు. క్లాసిక్ హీరోల విషయంలో అమితాబ్ టాప్ పొజిషన్ లో ఉండగా, తర్వాత కమల్ హాసన్, రాజేష్ ఖన్నా, మిథున్ చక్రవర్తి, రాజ్‌కుమార్, ధర్మేంద్ర తదితరులు ఉన్నారు.
ఇక హీరోయిన్ల విషయానికి వస్తే పోర్న్ స్టార్ సన్నీ లియోన్ తరువాతి స్థానంలో కత్రినా కైఫ్ (సల్మాన్, రణ్ బీర్ లతో బ్రేకప్ విషయంలో), కరీనా కపూర్ (షాహిద్ బ్రేకప్, సైఫ్ తో పెళ్లి) నిలిచారు. వీరి తర్వాత సౌత్ బ్యూటీ కాజల్ అగర్వాల్ ఉండటం విశేషం. ఆ తర్వాతి స్థానాల్లో దీపికా పదుకునే, ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా, తమన్నా బాటియా, అలియా భట్ లు ఉన్నారు.
అలాగే గూగుల్ సెర్చ్ లో నెటిజన్లు ఈ పదేళ్ల కాలంలో రికార్డు స్థాయిలో ఎక్కువగా వెతికిని సినిమాలు 'పీకే', 'బాహుబలి' అని గూగుల్ తెలిపింది. సగటున 10 మొబైళ్లలో 1 దాంట్లో సినిమాకు సంబంధించే జనాలు గూగుల్ పై పడుతున్నారని సంస్థ భారతీయ మార్కెటింగ్ హెడ్ సప్న చదా తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more