police busted sex rocket in khammam

Police conducted raids on prostitution house in khammam

guntur, easy money, police raids, prostitution house, khammam, whatsapp, social media, sex rocket, prostitution, women below 25 yrs, 3 town police station, crime

In a shocking inccident. police conducted raids on prostitution house in khammam and shocked to notice young men and women below age of 25 in the rocket

సెక్స్ రాకెట్ గుట్టురట్టు.. పాతికేళ్ల యువతీ, యువకులే టార్గెట్..

Posted: 07/17/2016 12:01 PM IST
Police conducted raids on prostitution house in khammam

సామాజిక మాధ్యమాలను వక్రమార్గానికి వినియోగించుకుని దాని ద్వారా వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న ఓ ముఠాపై దాడులు నిర్వహించారు. ఖమ్మం జిల్లా త్రీటౌన్ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా సెక్స్ రాకెట్ ముఠా నిర్వహిస్తున్న దందాను పోలీసులు గుట్టు రట్టు చేశారు. గుంటూరు నుంచి ఖమ్మంకు రెండు నెలల క్రితం వచ్చిన ఓ మహిళ త్రీటౌన్ పరిధిలో నివాసముంటోంది. డబ్బులు సంపాదించేందుకు మార్గాలు లేవనుకుందో.. లేకుంటే సులభంగా డబ్బులు సంపాదించేందుకు ఇదే సరైన మార్గం అనుకుందో కానీ లోకల్‌గా మరో నలుగురితో కలిసి తాను అద్దెకు ఉంటున్న ఇంటినే వ్యభిచార గృహంగా మార్చేసింది.

ఇక కస్టమర్లను ఎలా రప్పించాలని ఆలోచించిన ఆమెకు ఫేస్‌‌బుక్, వాట్సాప్‌‌లే బెస్ట్ ఛాయిస్‌గా కనిపించాయి. అంతే నిరుద్యోగ మహిళలను, యువతులే టార్గెట్‌‌గా సెల్‌‌ఫోన్‌‌కు పనిచెప్పింది. అలా కొన్ని రోజులు డబ్బులు దండుకుంది.. పంటపండిందనుకున్న సమయానికి ఈ తంతు అంతా పోలీసులు తెలుసుకుని మహిళకు షాకిచ్చారు. వ్యభిచార గృహంపై పక్క సమాచారాన్ని అందుకున్న పోలీసులు అకస్మిక దాడులు నిర్వహించడంతో సెక్స్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.
 
సమాచారం మేరకు వ్యభిచార గృహంపై దాడి చేసిన పోలీసులు కంగుతిన్నారు. ఈ రొంపిలో ఉన్నవారిలో 25 ఏళ్లు వయసున్న యువతీ,యువకులు ఎక్కువ కావడంతో పోలీసులు కంగుతిన్నారు. ఐదుగురు విటులను, నలుగురు మహిళలను అరెస్ట్‌‌ చేసినట్లు పోలీసు అధికారి మీడియాకు వెల్లడించారు. వారి నుంచి సుమారు రూ.10వేల రూపాయిల నగదు సెల్‌ఫోన్‌‌లు స్వాధీనం చేసుకున్నారు. మరోసారి ఇలా చేసేందుకు భయపడేలా నిర్వాహకురాలని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.  అరెస్టయిన వారిలో నిర్వాహకురాలు కూడా ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : khammam  sex rocket  prostitution  women below 25 yrs  3 town police station  crime  

Other Articles