జగమంత కుటుంబం నాది, అన్న పాటకు అక్షరాల నిజం చేద్దామనుకున్నాడో ఏమో తెలియదు కానీ ఈ ఇంటి పెద్దకు అదుపాజ్ఞల్లో సుమారు 200 మంది వున్నారంటే అతిశయోక్తి కాదు. కొందరు అన్నట్లు మహాభారతంలో దృతరాష్ట్రుడి మాదిరిగా కౌరవ సంతానానికి కేవలం ఒక సిక్సర్ వద్ద నిలిచిపోయాడు. అంటే సంతానం ఎంతమంది అంటారా.. అక్షరాల 94 మంది. అదేంటి అలా అంటారు, ఈయన నిజంగా కలియుగ దృతరాష్ట్రడే కదా అన్న వారు కూడా లేకపోలేదు. అయితే ఆ దృతరాష్ట్రుడికి కేవలం ఒక్క భార్య మాత్రమే. మరీ ఈ కలియుగ దృతరాష్ట్రుడికి మాత్రం 39 మంది భార్యలు.
ఇంటి నిండా జనంతో నిండు జీవితం ఆయనది. 39 మంది భార్యలు, 94 మంది పిల్లలు, 14 మంది కోడళ్లు, 33 మంది మనుమలు, మనవరాళ్లతో కలిపి 200 మంది వరకు ఉంటారు. ఈ ఇంటికి పెద్ద ఎవరు..? అయన పేరు ఏమిటీ..? అంటారు కదూ అయన పేరు జీయోనా చానా. ఈయన కూడా భారతీయుడే. మిజోరం రాష్ట్రంలోని భక్తవాంగ్ గ్రామంలో ఆయన నివాసం వుంటున్నారు. ఓ పెద్ద హోటల్ లా తలపించే ఈ నాలుగు అంతస్థుల భవనం.. అందులోని 100 గదులే ఆయన నివాస సముదాయం.
ఈయన ప్రపంచంలోనే అతి పెద్ద కుటుంబానికి పెద్దగా కూడా ఖ్యాతి గడించారు. నేను నా కుటుంబం అంటూ ఉమ్మడి కుటుంబాలు చిన్నభిన్నమై.. చిన్న కుటుంబం చింత లేని కుటుంబాలు రాజ్యమేలుతున్న తరుణంలో.. 200 మందికి పెద్దగా వుంటడం పట్ల చానా గర్వపడుతుంటారు. అయన దేవుడికి ముద్దబిడ్డ కావడంతోనే ఆయనకు ఇంత సంతానం కలిగిందని చెప్పకోస్తారు. తన కోసం ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా తన బార్య, పిల్లలు, మనుమలు, మనవరాళ్లు అందరూ కాచుకోవడం వల్ల తాను అదృష్టవంతుడినని చెప్పుకుని సంతోషిస్తారు చానా.
చానా 1945లో పుట్టిన జియోనాకు 17వ ఏటనే వివాహం అయింది. ఆయనకు ఇప్పుడు 39 మంది భార్యలు. చిన్న భార్య వయసు 38 ఏళ్లు. ఒక ఏడాదిలో ఏకంగా 10 పెళ్లిళ్లు చేసుకున్నారు. క్రైస్తవ మతానికి చెందిన చానా తెగలో బహు భార్యత్వం ఉంది. 70ఏళ్లు పైబడిని చానా అంతమంది బార్యలను ఎలా పెళ్లిళ్లు చేసుకున్నారు. అయన పెళ్లిళ్లకు భారత దేశంలోని చట్టాలు ఎలా అనుమతించాయి అంటారా..? అసలు అయన భార్యలు అందుకు ఎలా అంగీకరించారు..? అంటే ఆయన వివాహాల్లో అర్థం వుంది కాబట్టి.
వివాహం వయస్సు వచ్చినా పెళ్లిళ్లు చేసే స్తోమత లేని తల్లిదండ్రులను అయన ఒప్పించి పెళ్లి చేసుకున్నారట. అత్యధిక మంది వివాహాలు చేసుకోలేని వారే కావడం.. వారిని సహృదయంతో ఆయన పెళ్లి చేసుకున్నారట. అలా అంతమందినీ పెళ్లి చేసుకోవడానికి ఏదో ఒకటి కారణమట. దాంతో తన భర్తలోని సదుద్దేశాన్ని గ్రహించిన సతీమణులు కూడా అయన వివాహాలకు అడ్డుచెప్పలేదట. ఇక సతీమణుల పిర్యాదులు లేనిదే.. చట్టం జోక్యం చేసుకోలేదు. దీంతో ఆయన ఏకంగా 39 మందిని పెళ్లి చేసుకున్నారు. 94 మంది సంతానాన్ని కన్నారు. జియోనా ఎవరినీ మోసగించి పెళ్లి చేసుకోలేదని, బహుభార్యత్వం తమ తెగలో మొదటి నుంచి ఉందని చెప్పారు. తమ భార్యలు ఎవరి మధ్య గొడవలు లేవని, అన్యోన్యంగా ఉంటారని చెప్పుకోచ్చారు.
ఇది సరే. 200 మంది బోజన ఇత్యాదులకు ఎంత వండాలి.. అంటే..? అందరూ భోజనానికి కూర్చోవాలంటే 39 కోళ్లు తెగాల్సిందేనట.. అందరూ అన్నం తినాలంటే కనీసం 50 కిలోల బియ్యం వండాలి. 60 కిలోల బంగాళదుంపలు కూర ఉంటేనే పూట గడిచేది. ఇది ఒక కుటుంబం కథ. జియోనా తన భార్యలతో ఎలా గడుపుతాడని అందరికీ అనుమానం రావచ్చు. ఆయన మాత్రం అంత టెన్షన్ అవసరం లేదని, భార్యలే ఒకరితో ఒకరు మాట్లాడుకుని సమయం కేటాయించుకుంటారని జియోనా అన్నారు. కుటుంబ సభ్యులంతా ఒకే చోట ఉండేందుకు వీలుగా నాలుగు అంతస్థుల భవనం నిర్మించారు. తమ గ్రామానికి వచ్చే అతిథుల కోసం ఒక గెస్ట్ హౌస్ కూడా నిర్మించారు. పిల్లల కోసం జియోనా కుటుంబం ఒక స్కూల్ నడుపుకుంటోంది. ఇంట్లోవాళ్లే ఉపాధ్యాయులు.
జియోనా కుటుంబం స్వయంగా వ్యవసాయం చేస్తోంది. కోళ్లు, పందుల పెంపకం నిర్వహిస్తుంది. వారికి అవసరమైన ఆహారాన్ని వారే పండించుకుంటారు. పైగా తేయాకు తోటలు కూడా ఉన్నాయి. కుటుంబంలో కొందరు తేయాకు తోటలో పనిచేస్తారు. వడ్రంగి పని చేస్తారు. ఇంట్లో ప్రతి గదిలో ఒక టీవీ ఏర్పాటు చేశారు. ఇంటి మరమ్మత్తులు కూడా వాళ్లే చేసుకుంటారు. కాగా ఈనెల 21న జియోనా తన 71వ జన్మదినాన్ని ఘనంగా జరుపుకోబోతున్నారు. అతను మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆశిద్దాం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more