డబ్బు అందించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఏటీఎంలను ఆపై కొన్ని ప్రాంతాల్లో నీటిని అందించేందుకు కూడా వాడుతున్నారు. ఇక బాగా ధనికులు ఉన్న గల్ఫ్ లాంటి దేశాల్లో బంగారం అందించేందుకు కూడా ఉపయోగిస్తున్నారు. కానీ, ఇక్కడ చెప్పబోయేది మాత్రం కాస్త స్పెషల్. ఇది ఏకంగా తల్లి పాలను అందించే ఏటీఎం. ఎక్కడో కాదు, మనదేశంలోనే దీనిని నెలకొల్పారు.
నెలలు నిండకుండా, తక్కువ బరువుతో పుట్టిన నవజాత శిశువులను రక్షించేందుకు పుదుచ్చేరిలోని జవహర్లాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పోస్టుగ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(జిప్ మెర్) ఈ ఏటీఎంను ప్రారంభించింది. ‘అముధం తైప్పల్ మైయమ్(ఏటీఎం)గా పిలిచే ఈ ఏటీఎంలు, నెలలు నిండకుండా పుట్టే శిశువులకు తల్లిపాలు ఇచ్చి వారి ప్రాణాలు కాపాడతాయి. అంతేకాదు తల్లులకు ‘బ్రెస్ట్ ఫీడింగ్’పై కౌన్సెలింగ్ కూడా ఇస్తాయి.
ప్రతి నెల 15 వందల మంది జిప్ మర్ లో పుడుతున్నారు. వీరిలో 30 శాతం మంది నెలలు నిండాకుండానే తక్కువ బరువుతో పుడుతున్నారు. చాలా మంది చనిపోతున్నారు కూడా. వీరికి తల్లిపాలు అవసరం ఎంతో ఉంటుంది. అందుకనే నవజాత శిశువుల సంరక్షణ కేంద్రం (నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్-ఎన్ఐసీయూ)లో ఈ తల్లిపాల ఏటీఎంను ఏర్పాటు చేశాం’’ అని జిప్ మెర్ డైరెక్టర్ ఎస్సీ పరిజా తెలిపారు. గత బుధవారం ఏర్పాటు చేసిన ఈ ఏటీఎంకు మంచి స్పందన రావటంతో మరిన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు ఆయన చెబుతున్నారు. కాగా, గత కొద్దిరోజుల క్రితం దేశంలోనే తొలిసారి మధురైలో తల్లిపాల బ్యాంకును నెలకొల్పిన సంగతి తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more