రైతుల ఆత్మహత్యలకు దయ్యాలే కారణమని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా చెప్పడంపై నెట్ జనులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇప్పటికే రైతుల ఆత్మహత్యలపై చర్యలు తీసుకోవాలని పదే పదే చెప్పినా.. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలపై పలుమార్లు మొట్టికాయలు వేసినా.. చేష్టలుడికి చూస్తున్న ప్రభుత్వాలు.. మొత్తంగా రైతుల ఆత్మహత్యల వెనుక అర్థాన్నే మార్చేసే ప్రయత్నాలు చేస్తున్నాయని నెట్ జనులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
సాక్ష్యాత్తు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సొంత జిల్లా సెహోర్‌లో గత మూడేళ్లలో 418 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా వుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎలా వుందో ఇట్టే అర్థమవుతుందని మరికోందరు అవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు ఆత్మహత్యలను దెయ్యం పట్టి చనిపోతున్నారంటూ.. ఈ మేరకు రైతుల ఆత్మహత్యలపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని పక్కదారి పట్టించే ప్రయత్నం సాగుతుందని కూడా విమర్శలు వస్తున్నాయి.
అధునాథన సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తరుణంలో కూడా ప్రభుత్వం, దెయ్యాలను, క్షుద్రపూజలను నమ్ముతుందా అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే శైలేంద్ర పాటిల్ చేసిన వ్యాఖ్యలను అనేక మంది నెట్ జనులు సమర్థిస్తున్నారు. రైతుల ఆత్మహత్యలకు ఆర్థిక బాధలు కారణం కాదని, దెయ్యాలని హోం మంత్రి భూపేంద్ర చెప్పడంలోనే ఈ సమస్యపై ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి ప్రస్పుటిస్తుందని మరికోందరు వ్యాఖ్యనిస్తున్నారు. ప్రభుత్వం నివారణ చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ఈ ఆత్మహత్యలే స్పష్టం చేస్తున్నాయన్న విమర్శలూ వస్తున్నాయి.
తమవారు దయ్యాల వల్లే చనిపోయారని ఆత్మహత్య చేసుకున్న రైతుల బంధువులిచ్చిన సమాచారం ఆధారంగానే ఈ వివరాలను చెబుతున్నట్లు భూపేంద్ర చెప్పండంపై అనేక మంది తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే గత మూడేళ్లలో 418 మంది ఒక్క జిల్లాలో మరణించారంటే.. వాస్తవిక పరిస్థితులు మరెంత దారుణంగా వున్నయోనని కూడా నెట్ జనులు కామెంట్ చేస్తున్నారు. ఇక మరికోందరైతే రైతు ఆత్మహత్యలకు దెయ్యాలే కారణమైతే.. దీనిపై కూడా సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. దెయ్యాలు కేవలం రైతుల ప్రాణాలను మాత్రమే బలితీసుకున్నాయా.? లేక వ్యాపం కుంభభకోణంలో సాక్షలను, ప్రతక్ష్య, పరోక్షంగా సంబంధమున్నవాళ్ల ప్రాణాలను కూడా బలి తీసుకుందా.? అని వ్యంగంగా ప్రశ్నిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more