అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న డొనాల్డ్ ట్రంప్‌కు పెద్ద ఎదురుదెబ్బ. రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ నామినీగా అధికారికంగా ట్రంప్‌ను ప్రకటించిన మరునాడే మేకప్ ఆర్టిస్ట్ జిల్ హార్ట్ తన 20 ఏళ్ల సుదీర్ఘ మౌనాన్ని వీడారు. ట్రంప్ తనను లైంగికంగా వేధించారని ఆరోపించారు. 1993లో ట్రంప్ పలుమార్లు తనను లోబరుచుకునేందుకు ప్రయత్నించారని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ట్రంప్ తనను ఏ విధంగా వేధించినదీ పూసగుచ్చినట్టు వివరించారు.
అందాల పోటీలలో భాగంగా ట్రంప్ ఇచ్చిన విందుకు హాజరైన తనకు చేదు అనుభవం ఎదురైందని జిల్ హార్త్ గుర్తుచేసుకున్నారు. తన ఎదురుగా కూర్చున్న ఆయన టేబుల్ కింది నుంచి తన శరీరాన్ని తడిమారని, ఆయన చేష్టలు భరించలేక అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు పేర్కొన్నారు. ఓసారి అతని బెడ్‌రూములో తనపై లైంగిక దాడికి యత్నించారని ఆరోపించారు. పక్కగదిలో తాను పెళ్లిచేసుకోబోయే వ్యక్తి ఉండడంతో తాను తీవ్ర భయానికి లోనైనట్టు చెప్పారు. ట్రంప్ తన మొదటి భార్యకు విడాకులిచ్చిన తర్వాత తనపై వేధింపులు ఇంకా ఎక్కువయ్యాయన్నారు.
తాను లేకుండా బతకలేనని పలుమార్లు ఫోన్ చేసి చెప్పారని పేర్కొన్నారు. ఆయన వేధింపులు శ్రుతి మించడంతో చివరికి కేసు పెట్టాల్సి వచ్చిందని వివరించారు. తనను వేధించిన ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్నారని తెలిసి ఎంతో ఆశ్చర్యానికి గురైనట్టు జిల్ పేర్కొన్నారు. అయితే ట్రంప్ తనపై చేసిన లైంగిక దాడి గురించి మర్చిపోవాలని ప్రయత్నించానన్నారు. 1997లో ట్రంప్‌కు వ్యతిరేకంగా తాను పెట్టిన కేసును ఓ మీడియా సంస్థ తిరగదోడడంతో ఈ విషయంపై ఇప్పుడు నోరు విప్పాల్సి వచ్చిందన్నారు. ఈ విషయంలో తన ఇంటర్వ్యూ కోసం ఎన్నో సంస్థలు పోటీపడ్డాయన్నారు.
తనపై వచ్చిన లైంగిక ఆరోపణలను ట్రంప్ కొట్టిపడేశారు. జిల్ హార్త్ అబద్దాల కోరని వ్యాఖ్యానించారు. ట్రంప్ కుమార్తె సైతం తండ్రిని వెనకేసుకొచ్చారని దీంతో సమాజం దృష్టిలో తాను చెడు వ్యక్తిగా మిగిలిపోకూడదనే ఈ విషయాలు బయటపెట్టాల్సి వచ్చిందని జిల్ పేర్కొన్నారు. ట్రంప్ కారణంగా తన వ్యాపారం దెబ్బతిందని, తన పరువు పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదని, ట్రంప్ తనకు క్షమాపణలు చెబితే ఈ విషయం ఇక్కడితో ఆగిపోతుందని జిల్ హార్త్ పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more