పోలీసుల తమ అదుపాజ్ఞల్లో వుండే చిన్న నేరగాళ్లపై మాత్రం అతి చేస్తారు. అదే పెద్ద హోదా వెలగబెట్టి.. సమాజంలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్న నేరగాళ్లకు మాత్రం సలామ్ లు చేసి ఎంతో కొంత చేయి తడిస్తే చాలనుకుంటారు. రెక్కాడితే కాని డొక్కాడని కష్టజీవులు పూటగడవక ఏదైనా చిన్న వస్తువు దొంగలించగానే కటకటాల వెనక్కి నెడతారు. ఉద్దేశపూర్వకంగా బ్యాంకుల నుంచి రుణాలను పొంది కోటాను కోట్ల రూపాయల ప్రజా సంపదను కొల్లగట్టి పోయిన అర్థిక నేరగాళ్ల చెంతకు వెళ్లాలంటేనే జంకుతారు. అచ్చంగా ఇలాంటి ఘటనే చెన్నైలో జరిగింది. పోలీసులు ఓవరాక్షన్ కారణంగా మూడేళ్ల పసివాడు కటకటా రుచి చూశాడు.
ఒకటి రెండు రోజులు కాదు ఏకంగా 35 రోజుల పాటు దొంగతనం కేసులో జైలు జీవితాన్ని అనుభవించాడు. అభం శుభం తెలియని పసిప్రాయంలో పోలీసులు అతికారణంగా జైలు జీవితం అనుభవించిన ఆ పసివాడి హృదయం ఎంత మనోవేధనకు గురైవుంటుందని అన్న విషయాన్ని కూడా అలోచించకుండా, పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. ఈ ఘటన తమిళనాడులోని మధురై ప్రాంతంలో చోటు చేసుకుంది. మదురై సమీపంలోని నల్లూరులో ఓ జాతర వద్ద బొమ్మలు అమ్ముకుంటుండగా.. మఫ్టీలో వచ్చిన పోలీసులు దొంగతనం చేశారంటూ బాలుడి తండ్రి, అత్తయ్య, మామయ్యలను తమ వెంట తీసుకెళ్తూ ఆ పసివాణ్ని కూడా లాక్కెళ్లారు. ఆ బాలుడు తన కొడుకని, వాణ్ని తీసుకెళ్లొద్దని ఆ పిల్లాడి తల్లి మేరీ ఎంత మొత్తుకున్నా వారు మాట వినలేదు.
వీరిని పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. ఈ విషయం తెలుసుకున్న మేరీ తన కొడుకును తనకు అప్పగించాలని న్యాయస్థానానికి మొర పెట్టుకుంది. కానీ ఆ న్యాయమూర్తి మిగతా ముగ్గురితోపాటు ఆ పిల్లాడికి కూడా జ్యుడీషియల్ కస్టడీ విధించారు. దీంతో ఆమె మదురైలోని మద్రాస్ హైకోర్టు బెంచ్‌లో హెబియస్ కార్పస్ పిటీషన్ వేసింది. దీంతో పోలీసులు ఆ బాలుణ్ని న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. తల్లి సంరక్షణ లేకుండా బాలుణ్ని జైలుకు ఎందుకు పంపారంటూ పోలీసులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలుణ్ని అరెస్టు చేసిన పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆదేశాలు జారీ చేసింది. ఆ పసివాణ్ని తల్లి దగ్గరకు చేర్చిన న్యాయస్థానం.. బాలుడికి రిమాండ్ విధించిన జడ్జి నుంచి వివరణ కోరింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more