కృష్ణా పుష్కరాల హరతి బాధ్యత మళ్లీ బోయపాటికేనా? | Boyapati will direct the Krishna Harathi ritual

Boyapati will direct the krishna harathi ritual

Boyapati will direct the Krishna Harathi ritual, CBN boyapati, Krishna Harathi ritual again boyapati, Krishna pushkaralu Boyapati, Boyapati Saikumar for Krishna Pushkaralu

Boyapati Srinu will direct the Krishna Harathi ritual and Sai Kumar Voice Over.

కృష్ణా పుష్కరాల దర్శకుడు మారాడా?

Posted: 07/26/2016 07:33 PM IST
Boyapati will direct the krishna harathi ritual

గోదావరి పుష్కరాల వేళ ప్రతిష్టాత్మకంగా నిర్వహిద్దామన్న ఉద్దేశంతో ఏపీ సీఎం చంద్రబాబు దర్శకుడు బోయపాటి శీనుకు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే తొక్కిసలాటకు బోయపాటి దర్శకత్వ ఏర్పాట్లు కూడా కారణమేనని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఓవైపు ప్రజల ప్రాణాలు పోతున్నా, ఆయన తన షార్ట్ ఫిల్మ్ షూట్ చేసుకుంటూ ఉన్నాడన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఇందుకు సంబంధించి ఇద్దరిపై కేసులు కూడా నమోదయ్యాయి.

కట్ చేస్తే వాటిని పక్కనబెట్టిన చంద్రబాబు సర్కారు కృష్ణమ్మ హారతికి దృశ్యరూపం ఇచ్చే బాధ్యతలను కూడా ఆయనకే అప్పగించ్చింది. నదీమతల్లికి హారతినిచ్చే దృశ్యాలను చిత్రీకరించే బాధ్యతలను ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీనుకు అప్పగించినట్టు ఏపీ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి ప్రసాద్ తెలిపారు. హారతిచ్చే వేదిక డిజైన్ల పనులు కూడా ఆయనకే అప్పగించినట్టు వెల్లడించారు. దీనికి వాయిస్ ఓవర్ ను ప్రముఖ నటుడు సాయికుమార్ అందిస్తారని ఆయన తెలిపారు.

హారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి, చరిత్రలో నిలిచిపోయేలా చూడాలని ఇప్పటికే చంద్రబాబు ఆదేశించారని ప్రసాద్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఆదేశాల కాపీని ఇప్పటికే బోయపాటికి, సాయికుమార్ లకు అందజేసినట్లు ఆయన తెలిపారు. మరి దీనిపై మరెన్ని విమర్శలు వస్తాయో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Krishna Pushkaralu  Harathi ritual  Boyapati  Chandrababu  Sai Kumar  

Other Articles