నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా వెస్టిండీస్ తో కింగ్స్టన్ వేదికగా జరుగుతున్న రెండవ టెస్టులో మరోమారు ఇన్నింగ్స్ విజయంపై గురిపెట్టిన టీమిండియా విజయాలపై వరుణుడు నీళ్లు చల్లాడు. తొలి ఇన్నింగ్స్ లో 196 పరుగులకు అలౌట్ అయిన విండీస్ కు భారత్ ధీటైన జవాబునిచ్చింది. టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ స్వల్ప స్కోరుకే పెవిలియన్ దారి పట్టినా.. ఓపెనర్ లోకేష్ రాహుల్ సహా టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్యా రహానేలు శతకాలతో రాణించి భారత్ భారీ స్కోరును సాధించిపెట్టారు. దీంతో కోహ్లీ సేన విండీస్ పై 304 పరుగుల అధిక్యాన్ని నమోదు చేసింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 500 పరుగుల వద్ద తొమ్మిది విక్కట్ల వద్ద డిక్లేర్ చేసింది.
అయితే విజయం కోసం ఆశగా ఎదురుచూస్తున్న కోహ్లీ సేనను వరుణుడు దెబ్బతీశాడు, నాల్గవ రోజు మైదానంలో విరామం లేకుండా వర్షం పడుతుండటంతో ఆట నిలిచిపోయింది, అయితే అప్పటికే ఇషాంత్ శర్మ విండీస్ ఓపెనర్ వికెట్ ను సాధించాడు, ప్రస్తుతం విండీస్ స్కోరు వికెట్ నష్టానికి అరు పరుగలు సాధించింది. ఆటగాళ్లందరూ పెవిలియన వద్దే పడిగాపులు కాస్తున్నారు. మైదానంలో కవర్లు కప్పి ఉంచారు. ఏ క్షణంలో వర్షం ఆగితే మ్యాచ్ను అప్పుడే మొదలుపెడతారు. అయితే వర్షం మాత్రం ఏకధాటిగా కురుస్తూ ఆటగాళ్ల ఆశలపై నీళ్లు చల్లుతుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more