హరియాణాలోని ఫరీదాబాద్లో ఇంటర్ విద్యార్థిని ప్రేమ పేరుతో వంచించి అత్యాచారం చేసి, న్యూడ్ ఫోటోలతో బ్లాక్మెయిల్ చేసిన కేసులో ఒక యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకన్న ఘటనను మరువక ముందే అదే రాష్ట్రంలో మరో అత్యాచార ఘటన వెలుగుచూసింది. 19 ఏళ్ల యువతికి ఆవహించిన క్షుద్రశక్తులను వదిలిస్తానని చెప్పి 65 ఏళ్ల ఓ మంత్రగాడు పలుమార్లు అత్యాచారం జరిపిన ఘటన గుర్గావ్ లో జరిగింది. గుర్గావ్ కు చెందిన 19 ఏళ్ల బాలికకు క్షుద్రశక్తులు ఆవహించాయని దాంతో అమె కొంత విచిత్రంగా ప్రవర్తిస్తుందని భావించారు అమె తల్లిదండ్రులు.
గుర్గావ్ జిల్లాలోని సోహ్నా ప్రాంతంలోని దీన్ ముహమ్మద్ అలియాస్ దీను అనే 65 ఏళ్ల మంత్రగాడు ఇలాంటి వాటికి వైద్యాన్ని చేస్తాడని తెలుసుకున్న బాలిక తల్లితండ్రులు.. తమ బిడ్డకు కూడా భూతవైద్యంతో రోగాలను నయం చేయాలని కోరాతూ అతని వద్దకు తీసుకువెళ్లారు. తనకున్న శక్తులతో యువతికి పట్టిన దయ్యాన్ని వదిలిస్తున్నానని కుటుంబసభ్యులను నమ్మిస్తూ, యువతిపై గత కొన్నాళ్లుగా అత్యాచారం జరిపాడు. యువతికి దయ్యం వదిలివెళుతుందని చెపుతూ... యువతిని తీసుకువచ్చిన ప్రతిసారి ఆమెను రేప్ చేయడమే కాకుండా ఐదువేల రూపాయల చొప్పున తనకు ఫీజు ఇవ్వాలని మంత్రగాడు డిమాండు చేశాడు.
ఎన్ని పర్యాయాలు తీసుకెళ్లినా యువతికి రోగం నయం కాకపోవడంతో నిఘాపెట్టిన తల్లిదండ్రులు అసలు విషయాన్ని తెలుసుకుని షాక్ అయ్యారు. దీంతో మంత్రగాడి దుర్మార్గంపై గుర్గావ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హర్యానా పోలీసులు రంగప్రవేశం చేసి మంత్రగాడు దీన్ ముహమ్మద్ ను అరెస్టు చేసి, ఆయనపై మోసం, అత్యాచారంలపై ఐపీసీ సెక్షన్ 354, 376, 420ల కింద కేసు నమోదు చేశారు. మంత్రగాడికి సహకరించిన దారాబ్ ఖాన్ ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. మంత్రగాడైన దీన్ ముహమ్మద్ కు ముగ్గురు భార్యలు, పదిమంది పిల్లలున్నారని పోలీసుల విచారణలో తేలింది. నిందితుడు ముహమ్మద్ 2002లో పంచాయతీ సమితి అధ్యక్షుడిగా కూడా పనిచేశాడని పోలీసులు చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more