తన తండ్రి తీసిన ఫోటోలు వైరల్ కావడంతో అందులో వున్న కూతరు ఇప్పుడు సంబరపడుతుంది. ఎందుకలా. అంటే సోషల్ మీడియా ప్రభావంతో నేటి యువత లైక్ మీదే అధికంగా అధారపడివుంది. అందుకనే ఆ కూతరు కూడా తనకు వచ్చిన లైక్ చూసి తెగ అనందపడుతుంది. అయితే ఆ ఫోటోల కోసం తన తండ్రి తనతో చేయించిన సాహసం గుర్తుకోస్తే మాత్రం ఇప్పటికీ భయంలోంచి రాలేకపోతుంది. ఇంతకీ తన తండ్రి ఏం చేశారో తెలుసా..? అమెను స్విమ్మింగ్ కోసం తీసుకెళ్లిన నీళ్లలోకి దింపాడు. ఇంతదానికి ఎందుకంత భయపడటం అంటారా.. అక్కడికే వస్తున్నాం.
వివరాల్లోకి వెళ్తే.. స్టీఫెన్ ఫ్రింక్(67). అనే వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ తన కూతరు అలెగ్జా ఫ్రింక్(23)ను తీసుకుని వెళ్లి స్విమ్మింగ్ చేయమంటూ జార్డినెస్ డి లా రీనాలోకి దింపాడు. తన తండ్రి ఫోటోలు తీయడానికి ఇలా చేశాడని అనుకుని అలెగ్జా కూడా నీళ్లలోకి దిగి ఈత కోట్టింది. అలా అమె ఈత కోడుతుండగా అమె పక్కగా ఓ ఎనమిది అడుగులకు పైగా వున్న మొసలి వెళ్లింది. దానిని చూడగానే అమె భయంతో కంపించిపోయింది. అయితే ఆ నీళ్లలో ఒక్కటి కాదు అనేక పెద్దపెద్ద మొసళ్లు ఉన్నాయని, అవన్నీ నోరు తెరిచి ఆహారం కోసం ఎదురుచూస్తుంటాయని తెలుసుకున్న ఆమె షాక్ కు గురైంది.
అయితే ఆ పక్కనే తన తండ్రి వుండటంతో అమె కొంచెం ధైర్యంగా వుంది. తన ఫొటోలు తీస్తున్న తండ్రిని చూడడంతో కావాలనే తండ్రి అలా చేశాడని నిర్ణయించుకుని మరుక్షణం ఒడ్డుకు చేరింది. అయితే తండ్రి గురించి తెలిసిన ఆమె తన కోపాన్ని అక్కడితో వదిలేసింది. అయితే తనకు ప్రమాదం తలపెట్టే పని తండ్రి ఎన్నటికీ చేయడని, తాను ప్రమాదంలో పడితే చూస్తూ ఊరుకోడని చెబుతోంది అలెగ్జా. మొసలి పక్కన తానున్న ఫొటోలు చాలా బాగా వచ్చాయంటూ తర్వాత తండ్రిని మెచ్చుకుందీ తనయ..
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more