Celebrate the goodness of craft beer at Weekender festival

Craft beer is the new healthy alternative drink in india

craft beer weekender, craft beer weekender festival, craft beer, craft beer india, best craft beer india, top 10 craft beer in india, top 10 craft beer india

Enjoy a weekend of beer madness with live beer counters, live BBQ stations, quirky beer merchandises and games.

‘ఆ’ బీరు తాగితే అరోగ్యమే.. అరోగ్యం.. ఇక లాగించండీ..!

Posted: 08/07/2016 09:54 AM IST
Craft beer is the new healthy alternative drink in india

బీరు ప్రియులకు శుభవార్త. ఇకపై బీరు తాగితే అనారోగ్యం బారిప పడతారన్న దిగులను దూరం చేసే సరికొత్త బీరు మందుబాబుల ముందకు రానుంది. బీరు ఎంతగా లాగిస్తే అంత అరోగ్యకరం అన్న లేబుల్స్ బీరు సిసాలపై ముద్రించే రోజులు కూడా రానున్నాయి. అదేంటి బీరు తాగిడం అరోగ్యానికి హానికరం అన్న లేబుల్స్ లేకుండా చేయడానికే ఎన్నో ప్రయత్నాలు చేసినా.. అవి విఫలమైయ్యాయి. అలాంటిది బీరు తాగితే అరోగ్యకరం అన్న లేబుల్స్ బీరు సీసాలపై దర్శనమిస్తాయంటే అశ్చర్యపోతున్నారా..? కానీ ఇది నిజం.

సంప్రదాయ బీరులో కృత్రిమ రుచులు, ప్రిజర్వేటివ్స్ వాడడం వల్ల అది తాగితే అనారోగ్యం వస్తుందని అందరికీ తెలుసు. దీనికి ప్రత్యామ్నాయం లేక, ఆరోగ్యానికి హానికరమని తెలిసినా బీరు ప్రియులు రుచికోసమే, కిక్కు కోసమో తెలియదు కానీ దానినే తాగి అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపాయి ముంబై, పుణేల్లోని ఆరు చిన్న బీరు పరిశ్రమలు. సంప్రదాయ బీరుకు పోటీగా ‘క్రాఫ్ట్‌బీరు’ పేరుతో సరికొత్త బీరును రంగంలోకి దించాయి. దీన్ని తాగడం ఆరోగ్యానికి హానికరం కాదు..శ్రేయస్కరం అంటున్నారు నిపుణులు.

అంతేకాదు సాధారణ బీరు కన్నా ఇది ఎక్కువ నాణ్యతతో, కృత్రిమ రుచులు కలపకుండా సహజసిద్ధంగా ఉన్నందు వల్ల దీనిని సేవించే వారికి అరోగ్యానికి కూడా ఎలాంటి హానీ వుండదంటున్నారు. దీన్ని తయారు చేయడానికి మాల్ట్, హాప్స్ (బీరు తయారీలో వాడే ఒకరకం పువ్వులు), ఈస్ట్, నీరు వాడతారు. దీని వల్ల బీరులో పోషక విలువలూ ఉండటం.. ఈ బీరును తాగడం వల్ల బీరుబాబులకు పోషక విలువలూ అందుతాయి. సంప్రదాయ బీరు తాగితే అనారోగ్యం వస్తే.. క్రాఫ్ట్ బీరు తాగితే ఆరోగ్యం మెరుగుపడుతుంది.

అయితే ఇది ఇంకా విస్తృతంగా అందుబాటులోకి రాలేదు. లెసైన్సులు పొందడం నుంచి మద్యం దుకాణాలకు పంపిణీ వరకు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. వీటిని అధిగమించి, క్రాఫ్ట్‌బీరుకు ప్రచారం కల్పించే పనిలో తయారీదారులు ఉన్నారు. ఇందుకోసం, శుక్రవారం ప్రపంచ బీరు దినాన్ని పురస్కరించుకుని ముంబైలో శనివారం నుంచి రెండు రోజులపాటు ‘క్రాఫ్ట్‌బీరు వీకెండర్’ పార్టీని నిర్వహిస్తున్నారు. సాధారణ బీరుతో పోలిస్తే క్రాఫ్ట్‌బీరు ధర కాస్త ఎక్కువేననీ, ముడిసరుకుల అధిక ధరలే ఇందుకు కారణమని తయారీదారులు వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Preservatives  Illness  Beer industry  Craft beer  Beer lovers  

Other Articles