ఒక అందమైన అమ్మాయి చాలా హాట్ గా ఉంది. అంతే హాట్ డ్రెస్ కూడా వేసుకుంది. మీకూ ఎదురుపడి నాకెవరూ స్నేహితులు లేరు. నాతో స్నేహం చేస్తారా! అంటే మీరేం చేస్తారు? అమ్మాయిల సంగతి ఏమోగానీ. అబ్బాయిలు మాత్రం ఎగిరి గంతేసి, ఏమీ అదృష్టం అని చంకలు గుద్దుకుంటారు కదా. కానీ, అక్కడే ఓ ట్విస్ట్ ఉంది. అలా స్నేహితులను చేసుకుంటూనే అందరినీ బకారాలను చేసేసింది ఓ యువతి.
ఆగష్టు మొదటి ఆదివారం ఫ్రెండ్ షిప్ డే అన్న సంగతి గుర్తుంది కదా. ఈ సందర్భంగా 20 ఏళ్ల వయసున్న ఓ అందమైన యువతి, పైగా చిన్న నిక్కరు, ఓ టాప్ మాత్రమే వేసుకుని స్నేహితులు కావాలంటూ వీధుల్లో పడి తిరగడం మొదలుపెట్టింది.
అబ్బాయిలు, అమ్మాయిలు అనే తేడా లేకుండా తనకు ఎదురుపడిన వాళ్లన్నల్లా తాను ఢిల్లీ నుంచి వచ్చానని, ఫ్రెండ్స్ ఎవరూ లేరని, తన ఫ్రెండ్ గా ఉండమని కోరింది. అందంగా ఉంది, పైగా జోవియల్ గా మాట్లాడుతుండటంతో, చాలా మంది సరేనని ఒప్పుకోవటం, ఆపై వారికి ఆమె ఫ్రెండ్ షిప్ బ్యాండ్ కట్టేయడం జరిగిపోయింది. ఇక వెంటనే బ్యాండ్ కి 40 రూపాయలు ఇమ్మని కోరింది. ఖంగుతిన్న చాలా మంది అదేంటనీ ప్రశ్నించారు. ఫ్రెండ్ షిప్ ఫ్రీ కానీ, బ్యాండ్ కాదు. 40 లేదంటే 20 అయినా చెల్లించి కదలానని కోరింది. చాలా మంది తమ దగ్గర డబ్బుల్లేవని చెప్పగా, మరికొంత మంది నువ్వు వద్దు, నీ ఫ్రెండ్ షిప్ వద్దు బాబోయ్ అంటూ బ్యాండ్ తిరిగి ఇచ్చేశారు. ఒక వ్యక్తి మాత్రం చిల్లర లేదంటూ 100 చెల్లించగా, ఆ నోటుతో ఉడాయించే ప్రయత్నం చేసింది.
ఆపై తీరిగ్గా ఇదో టీవీ ప్రోగ్రాం అని చెప్పటంతో వారంతా ఘోల్లుమన్నారు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు పదుల సంఖ్యలోనే బకారాలను చేసింది ఆ పడతి. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా గత ఆదివారం ఢిల్లీలో ముగ్గురు నెటిజన్లు ఇలా జనాల్ని కాసేపు ఆటపట్టించి ఆ సరదా వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు. దాన్ని మీరూ చూసేయండి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more