మావోయిస్టుగా జీవితాన్ని ప్రారంభించి.. తరువాత కోవర్టుగా మారిన ఆ తరువాత పోలీసులకే సవాల్ విసురుతూ.. మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేరి భూ అక్రమణలు, సెటిల్ మెంట్లతో రియల్టర్ల నుంచి బడా రాజకీయ వేత్తల వరకు అందరినీ వణికిస్తూ.. ఎదిగిన గ్యాంగ్ స్టర్ నయీముద్దీన్ అలియాస్ నయీం ను పోలీసులు హతమార్చడంతో తెలంగాణలోని పలువురు వ్యాపారవేత్తలతో పాటు రాజకీయ వేత్తలు కూడా ఊపిరిపీల్చుకుంటున్నారు. నల్లమల కోబ్రాస్, నర్సా కోబ్రాస్, కాకతీయ కోబ్రాస్ పేరుతో చెలామణి అయిన నయీమ్ ను తుదకు తాను నమ్ముకున్న, పట్టుకున్న ఆయుధమే తనను బలితీసుకుంది.
ఆయన మరణంతో ఆయన ఇళ్లు, గెస్ట్ హౌస్ లపై ఉదయం నుంచి దాడులు చేస్తున్న పోలీసులు అటు భువనగిరిలోని ఆయన నివాసంలోనూ తనిఖీలు చేశారు. ఇద్దరు డీఎస్పీలు, నలుగురు ఏఎస్పీలు తనిఖీల్లో పాల్గొన్నారు. నయీం ఇంట్లో భారీగా వున్న నగదును చూసిన పోలీసులు విస్తుపోయారు. డబ్బుల కట్టలు పెద్ద సంఖ్యలో వుండటంతో నాలుగు మనీ కౌంటింగ్ మెషీన్లను సాయంతో దాన్ని లెక్కపెట్టారు పోలీసులు. నయీం ఇంటిచుట్టూ భారీగా పోలీసులు మోహరించారు.
నల్లగొండ జిల్లాలో పలు ప్రాంతాల్లో పోలీసులు నయీం అనుచరులు, బంధువుల ఇళ్లల్లో సోదాలు చేశారు. మిర్యాలగూడలో నయీం అత్త, ఆమె అక్క ఇళ్లల్లో సోదాలు చేసి 6.50 లక్షల రూపాయల నగదు, రెండు బ్యాగుల్లో డాక్యుమెంట్లు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. భువనగిరిలో నయీం ఇంట్లోను, అతని అనుచరుల ఇళ్లల్లోను తనిఖీలు చేపట్టారు. పోలీసులు భువనగిరి ఎంపీపీ వెంకట్ యాదవ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండల పరిధిలో పోలీసులు సోదాలు చేసి నయీం అనుచరులు ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. నయీం అనుచరుల ఇంట్లో కోట్లాది రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. రెండు కౌంటింగ్ మిషన్లతో డబ్బును లెక్కిస్తున్నారు. పోలీసులు రెండు వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక వ్యవహారాలకు నయీం ఈ ఇంటిని అడ్డాగా వాడుకున్నట్టు భావిస్తున్నారు. నయీం హతమైన సంఘటనా స్థలాన్ని ఎస్పీ రమా రాజేశ్వరి పరిశీలించారు. పోలీసులు నయీం కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో నయీం భార్య, కూతురు, అత్త, బావమరిది ఉన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more