Abhinav Bindra misses medal but pleased with his performance in Rio Olympics

Abhinav bindra s olympic farewell ends in a fourth place finish

10m air rifle event, Abhinav Bindra, From the sidelines, India, Indian shooter, Olympic swansong, Gagan Narang, Indian Hockey team, Olympics 2016, Rio 2016, Rio Olympics 2016, Shooter

Indian shooter Abhinav Bindra's quest for a second Olympics medal met with a disappointing end as he lost a tense shoot-off in the men's 10m air rifle event

పతకం ఆశలపై నీళ్లు చల్లిన అభినవ్ బింద్రా

Posted: 08/08/2016 09:54 PM IST
Abhinav bindra s olympic farewell ends in a fourth place finish

రియో ఒలింపిక్స్‌లో బోణీ కొట్టి.. పతకాల పట్టికలో స్థానం సాధించాలన్న భారత క్రీడాభిమానుల ఆశలు ఇవాళ కూడా అఢియాశలయ్యాయి. ఇవాళ కూడా భారత్‌కు చేదు ఫలితాలు ఎదురయ్యాయి. ఒక్క దీప్తి మినహా ఏ రంగంలోనూ భారత క్రీడాకారులు అకట్టుకోలేకపోయారు. భారత హాకీ పురుషుల జట్టుతో పాటు షూటింగ్ విభాగంలో కూడా భారత షూటర్లు తీవ్రంగా నిరాశపరిచాడు. హాకీలో 2-1 తేడాతో భారత్‌పై జర్మనీ జట్టు విజయం సాధించి ముందుకు దూసుకెళ్లింది.

పురుషుల పదిమీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో సత్తా చాటి ఫైనల్‌లోకి అడగుపెట్టిన అభినవ్ బింద్రా కొద్దిలో పతకాన్ని జారవిడుచుకున్నాడు. కేవలం 0.1 పాయింట్ తేడాతో కాంస్య పతకాన్ని మిస్ చేసుకున్న బింద్రా నాల్గవ స్థానంలో నిలిచాడు. అంతకుముందు మరో భారత షూటర్‌ గగన్ నారంగ్‌ మాత్రం మరోసారి విఫలమయ్యాడు. ప్రాథమిక రౌండ్‌లోనే అతని గురితప్పడంతో నారంగ్‌ 23వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. దీంతో భారత్‌ షూటింగ్ విభాగంలో ఏ పతకాన్ని సాధించలేకపోయింది.

బింద్రా 163.8 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. ఇటలీ ఆటగాడు కెంప్రైనీ 206.1 పాయింట్లతో బంగారు పతకాన్ని కైవసం చేసుకోగా, రెండో స్థానంలో ఉక్రెయిన్ ప్లేయర్ కూలిష్, మూడో స్థానంలో రష్యా ఆటగాడు మస్లిన్నికోవ్ నిలిచారు. అంతకు ముందు బింద్రా ప్రాథమిక రౌండ్‌లో చక్కని ప్రతిభ కనబరిచి ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఇదే విభాగంలో పాల్గొన్న మరో భారత షూటర్‌ గగన్ నారంగ్‌ మాత్రం మరోసారి విఫలమయ్యాడు. ప్రాథమిక రౌండ్‌లోనే అతని గురితప్పడంతో నారంగ్‌ 23వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Abhinav Bindra  Rio Olympics  Olympics 2016  Gagan Narang  Indian Hockey team  

Other Articles