తెలంగాణ లో కొత్తగా 14 జిల్లాలు | KCR finalized 24 districts for Telanagana

Kcr finalized 24 districts for telanagana

telangana new districts, telangana 24 districts, New districts in Telangana, Nirmal new district, Siricilla out from district list, Hyderabad two new districts, Ranga Reddy as one, KCR announced new districts, new districts notification, telanagana new districts notification, 14 new districts final for telanagana, KTR Siricilla district

KCR finalized 24 districts for Telanagana, notification released soon and announced on Dussera.

కొత్త జిల్లాల ఏర్పాటు అసలేం జరుగుతోంది?

Posted: 08/10/2016 12:36 PM IST
Kcr finalized 24 districts for telanagana

పక్కదారి పడుతుందన్న టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటు అంశాన్ని త్వరగతిన పూర్తి చేయాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. రెండేళ్లుగా ఊరిస్తూ వస్తున్న ఈ అంశంపై ఎట్టి పరిస్థితుల్లో దసరాలోగా ప్రకటన చేసేయాలని సీఎం కేసీఆర్ ధృడ నిశ్చయంతో ఉన్నారు. ఈ అంశంలో ఇప్పటికే మంత్రులు, అధికారుల‌ నుంచి నివేదిక‌లు తెప్పించుకున్న సంగ‌తి తెలిసిందే.

సీసీఎల్‌ఏ రేమండ్ పీటర్ నేతృత్వంలో కమిటీ కూడా నివేదిక అందజేయటంతోపాటు, కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను మ‌రింత వేగవంత‌ం చేసింది. సీఎం కేసీఆర్ తో గురువారం సీఎస్ రాజీవ్ శర్మ, కమిటీ సభ్యులు, అధికారుల‌తో సుదీర్ఘంగా మంతనాలు జరుపుతున్నారు. మొత్తం 14 కొత్త జిల్లాలు, 74 మండలాలను ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది. జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ను ఎలా ప్రారంభించాలో ఆయనకు అధికారులు వివరించారు.

దీంతోపాటే కరీంనగర్ నుంచి జగిత్యాల ను ఇప్పటికే జిల్లాగా ప్రకటించిన నేపథ్యంలో కేటీఆర్ సిరిసిల్లను చేర్చలేమని వారు చెప్పారంట. ఇదే సమయంలో నిర్మల్ ను కొత్త జిల్లా పేరులోకి పరిగణనలోకి తీసుకున్న అధికారులు, రంగారెడ్డిని మాత్రం అలాగే ఉంచి, హైదరాబాద్ ను మాత్రం రెండుగా చేయాలని చెబుతున్నారంట. ఆగష్టు 22న జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుద‌ల చేసి, ఆ త‌రువాత వాటిపై వ‌చ్చే అభ్యంత‌రాల సేక‌ర‌ణ‌కు 30 రోజులు గ‌డువు ఇవ్వనున్నారు. ఆపై విజయదశమి రోజునే కొత్త జిల్లాల ఏర్పాటు అమలులోకి వచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

24 జిల్లాల తెలంగాణ:

హైదరాబాద్
సికింద్రాబాద్
రంగారెడ్డి
మహబూబ్ నగర్
నాగర్ కర్నూల్
వనపర్తి
కరీంనగర్
జగిత్యాల్
అదిలాబాద్
కొమురం భీం(మంచిర్యాల్)
నిర్మల్
నిజామాబాద్
కామారెడ్డి
ఖమ్మం
భద్రాద్రి (కొత్తగూడెం)
సంగారెడ్డి
మెదక్
సిద్ధిపేట్
నల్గొండ
సూర్యాపేట్
యాదాద్రి
వరంగల్
మహబూబాబాద్
జయశంకర్ (భూపాలపల్లి)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana  24 districts  nirmal  Rangareddy  KCR  dussera  

Other Articles