Manipur: 7-year-old injured in bomb blast targeting BSF camp

Two bomb blasts rock manipur today 7 year old injured

bsf, manipur blast, bsf blast, imphal blast, blast in manipur, manipur attack, bsf attack manipur

A 7-year-old child was reportedly injured in a bomb blast that was targeted at a Border Security Force (BSF) camp in Manipur

మణిపూర్ లో జంట బాంబు పేలుళ్లు.. అందోళనలో ప్రజలు..

Posted: 08/10/2016 08:32 PM IST
Two bomb blasts rock manipur today 7 year old injured

మ‌ణిపూర్ రాజ‌ధాని ఇంఫాల్ పేలుళ్ల మోత‌తో ద‌ద్ద‌రిల్లింది. రెండు వ‌రుస పేలుళ్ల‌తో అక్క‌డి ప్ర‌జ‌లు తీవ్ర ఆందోళ‌న చెందారు. గంటల వ్యవధిలో చోటుచేసుకున్న రెండు బాంబు పేలుళ్లు నేపథ్యంలో మణిపూర్ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. రెండు వరుస పేలుళ్లు జరగడంతో ఇంఫాల్‌ నగరవాసులు ఉల్లిక్కిపడ్డారు. ఉదయం బీఎస్‌ఎఫ్ శిబిరం సమీపంలో ఐఈడీ పేలుడు సంభ‌వించింది. పేలుడుతో గాయ‌ప‌డిన ఏడేళ్ల బాలికను సమీపంలోని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. బీఎస్ఎఫ్ దళాలను టార్గెట్ గా చేసుకునే ఈ పేలుళ్లు సంభవించినట్లు అధికారులు భావిస్తున్నారు.

ఈ ఘటన జరిగిన కొన్ని గంటటలోనే మరో బాంబు పేలుడు సంభవించింది. ఈసారి ఇంపాల్ లోని మణిపూర్ యూనివర్సిటీ వద్ద బాంబు పేలుడు సంభవించింది. రిమోట్ ద్వారానే ఈ రెండు బాంబు పేలుడ్లు జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. మాపౌ అనే గ్రామం వద్ద బీఎస్ఎఫ్ బలగాలు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అనూహ్యంగా బాంబు పేలింది. అయితే, ఈ దాడి నుంచి బీఎస్ఎఫ్ జవాన్లు తప్పించుకోగా.. నాలుగేళ్ల పాపకు మాత్రం గాయాలయ్యాయి. రెండోసారి బాంబు దాడి మాత్రం యూనివర్సిటీ వద్ద సంభవించింది. ఈ ఘటన సమయంలో విద్యార్థులంతా క్లాస్ రూముల్లోనే ఉన్నారు. అయితే, ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని ప్రాథమిక సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bsf  manipur blast  bsf blast  imphal blast  blast in manipur  manipur attack  bsf attack manipur  

Other Articles