16 ఏళ్లుగా ఒకే ఒక్క అంశంపై నిరాహారదీక్ష చేస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం అసలు కనుకరించకుండా.. అమెను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న నేపథ్యంలో దీక్షకు స్వస్తి పలికి ఇక ప్రజాస్వామ్య దేశంలో రాజకీయంగానే పావులు కదపాలని నిర్ణయించుకుంది ఉక్కు మహిల ఇరోం షర్మిల. దేశంలోని ఈశాన్య రాష్ట్రాలలో సైనిక బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేయాలంటూ 16 ఏళ్ల క్రితం నిరాహార దీక్ష చేపట్టిన అమె దీక్షను విరమించడంతో కొన్ని సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలో అస్పత్రి వద్ద సాయుద పోలీసు బలగాలను మోహరించారు.
షర్మిల ప్రస్తుతం ఇక్కడి జవహర్‌లాల్ నెహ్రూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ ఆస్పత్రి వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. ఏళ్లపాటు నిరశన కొనసాగినందువల్ల శరీరం ఒక్కసారిగా ఘన ఆహారానికి మారే పరిస్థితి లేదని, ప్రస్తుతానికి ప్రత్యేక ద్రవాహారాన్ని అందజేస్తున్నామని వైద్యులు చెప్పారు. దీక్షను విరమించినప్పటికీ సైనికచట్టం రద్దు చేసేవరకూ గోళ్లను కత్తిరించుకోరాదన్న, తల దువ్వుకోరాదన్న, ఇంటికెళ్లి తన తల్లిని కలుసుకోరాదన్న నిర్ణయాన్ని ఆమె కొనసాగిస్తున్నారు.
ఆరోగ్య సీక్రెట్ చెప్పిన షర్మిల
16 ఏళ్ల నిరహార దీక్ష చేసినప్పటికీ షర్మిల ఆరోగ్యం దాదాపు నిలకడగానే ఉండడం వెనుక సీక్రెట్ ను ఇరోం షర్మిల బయటపెట్టింది. తన ఆరోగ్యం వెనుక పెద్ద రహస్యం ఏమీ లేదని అయితే దృఢ సంకల్పం, నిత్య యోగా సాధన అలవాటే ఆమె ఇంతకాలం జీవించడానికిగల కారణమని షర్మిల సోదరుడు సింఘాజిత్ చెప్పారు. దీక్షకు దిగే రెండేళ్ల ముందే (1998లో) షర్మిల యోగా నేర్చుకున్నట్లు కుటుంబ సభ్యులు, సన్నిహితులు తెలిపారు. ప్రకృతి చికిత్సపై మక్కువతో షర్మిల ఆ కోర్సును ఎంపిక చేసుకోగా అందులో యోగాభ్యాసం కూడా ఉన్నట్లు వివరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more