సుందరం ట్రావెల్స్ నటి రాధపై కేసు | Woman complaints against Sundaram Travels actress Radha

Woman complaints against sundaram travels actress radha

Sundaram Travels actress Radha, case file against adha, Actress Radha Illegal Affair, Woman complaints against Radha, Actress affair with AIADMK candidate, Radha Muni Vel

Woman complaints against Sundaram Travels actress Radha.

అక్రమ సంబంధంలో నటి రాధపై ఫిర్యాదు

Posted: 08/13/2016 06:59 AM IST
Woman complaints against sundaram travels actress radha

మరో నటి వ్యవహారం పోలీస్ స్టేషన్ కి చేరింది. తన భర్తను ట్రాప్ చేసి తనకు దూరం చేసిందంటూ ఓ మహిళ ప్రముఖ తమిళ సినీ నటిపై ఫిర్యాదు చేసింది. 'సుందరం ట్రావెల్స్' అనే తమిళ సినిమాలో హీరోయిన్ గా నటించిన రాధ కు మునివేల్ అనే ఏఐఏడీఎంకే కార్యకర్తకు పరిచయం వివాహేతర సంబంధానికి దారితీయటంతో అతని భార్య ఉమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత కొంతకాలంగా తన భర్తకు రాధతో పరిచయం ఉందని, అది హద్దులు మీరడంతో తనను వదిలేశాడని ఆమె ఆరోపిస్తోంది.

ఇది వరకు ఈ విషయం పోలీసులను ఆశ్రయించగా, వారు కౌన్సిలింగ్ ఇవ్వడంతో తామిద్దరం కలిసి ఉంటున్నామని ఉమాదేవి చెప్పింది. అయినప్పటికీ రాధ తన భర్తను విడిచిపెట్టడం లేదని, పలు మార్లు తమను వేధిస్తూనే ఉందని, తన భర్తకు నిరంతరం ఫోన్లు చేస్తూనే ఉందని, తనకి కూడా ఫోన్‌ చేసి నోటికొచ్చినట్లు మాట్లాడుతోందని ఆమె చెన్నైలోని విరుగంబాక్కం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఫిర్యాదులో ఆరోపించింది.

Actress Radha Affair Case

రాధ బెదిరింపులకు భయపడి తన కుమార్తె కాలేజీకి కూడా వెళ్లడం లేదని ఫిర్యాదులో పేర్కొంది. ఇంతలా బెదిరిపోయిన తమకు రెండు రోజులుగా తన భర్త కనిపించకపోవడం మరింత ఆందోళనకు గురి చేస్తోందని తెలిపింది. తన భర్తను వెతికి తీసుకురావాలని ఆమె పోలీసులను కోరింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రాధ సన్నిహితులు మాత్రం అతను కనిపించకుండా పోవడానికి, రాధకు సంబంధం లేదని అంటున్నారు. దీనిపై స్పందించేందుకు రాధ నిరాకరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sundaram Travels  actress  Radha  AIADMK Candidate  Muni Vel  

Other Articles