మాజీ నక్సలైట్, గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్ తో నేర సామ్రాజ్యపు పునాదులు కదులుతున్నాయి. సిట్ అధికారులు సైతం నయీం ఏర్పాటు చేసుకున్న నెట్‌వర్క్ చూసి నివ్వెరపోతున్నారు. తాజాగా నార్సింగిలోని ఇంట్లోని బెడ్రూంలో దొరికిన డైరీల బూజు దులిపిన ఖాకీలకు మరో ఖద్దర్ దీని వెనక ఉన్నట్లు నిర్థారణ చేసుకన్నారు. ఇంతకు ముందు నల్గొండకు చెందిన మాజీ మంత్రి హస్తం ఉందని వార్తలు రావటం, ఆపై టీడీపీ సీనియర్ నేత ఉమామాధవరెడ్డి తమను బద్నాం చేస్తున్నారంటూ ప్రెస్ మీట్ పెట్టిన సంగతి తెలిసిందే.
నయీం ‘కోకోనట్’ రాసలీలు ఎంతలా అంటే...
ఈ నేపథ్యంలో గతంలో హైదరాబాదు కేంద్రంగా భూదందాలకు పాల్పడిన ఓ మాజీ మంత్రి పేరు ఇప్పుడు దొరికిన డైరీలో ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా నయీం తన అభిరుచులకు అనుగుణంగా కట్టించుకున్న ఫామ్ హౌస్ ను ఆనుకుని ఈ మాజీ మినిస్టర్ కూడా మరో ఫామ్ హౌస్ ను నిర్మించుకున్నారట. దీంతో పోలీసులు ఆయన వ్యవహారాలపై కూపీ లాగే పనిలో పడ్డారు సిట్ పోలీసులు. సదరు నేత ఇప్పటికే పలు పార్టీలు మారి అధికార పార్టీవైపు చూస్తున్నారని తెలుస్తోంది. దీంతో ఈ మంత్రి ఎవరు? అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.
సినీ ఇండస్ట్రీతోనూ సంబంధాలు:
రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని భావించిన గ్యాంగ్‌స్టర్ నయీమ్ దానికి ముందు తన జీవిత చరిత్రను సినిమా రూపంలో తెరకెక్కించే ప్రయత్నం కూడా చేశాడన్న వార్తతో సినిమా వాళ్లతోనూ నయీం లింకులు కన్ఫర్మ్ అయ్యాయి. దందాలు చేసే నయీం ఆ సినిమాలో ‘పాజిటివ్’గా చూపించుకోవాలని ఆరాటపడ్డాడని, అందుకు తెలుగు సినీ పరిశ్రమలోనూ కొందరితో సంప్రదింపులు కూడా జరిపాడని పోలీసులు చెబుతున్నారు. నయీం డైరీ(లీ) సీరియల్ లో ఇందుకు సంబంధించిన విషయాలున్నాయని వారు చెబుతున్నారు. అంతేకాదు ఏకంగా భువనగిరి అసెంబ్లీ సీటుపై కన్నేసిన నయీం ఆ సన్నాహాల్లో భాగంగానే తన సినిమానూ ప్రచారాస్త్రంగా వాడుకోవాలని భావించినట్లు తెలిసింది.
నయీం డైరీలో కీలక పేర్లు... బెడ్ రూంలో ఏముంది?
సిట్ దర్యాప్తు జెట్ స్పీడు:
ఇక నయీమ్ వ్యవహారంలో సిట్ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. 12కేసులు నమోదవగా, 22 మందిని అరెస్టు చేశారు. నయీమ్ డైరీలో కొంత మంది అత్యున్నత స్థాయి అధికారుల కొత్త పేర్లున్నట్లు తెలుస్తోంది. నయీమ్ అనుచరులందరి వద్ద గన్స్, బుల్లెట్లు, డిటోనేటర్లు వంటి పేలుడు పదార్థాలు లభిస్తున్నాయి. నయీమ్‌తో కొంత మంది బడా రాజకీయ నేతలు, పోలీసు అధికారులు దిగిన ఫోటోలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
నయీమ్ అస్తుల వివరాలతో ఖంగుతిన్న పోలీసులు
ఇంకోవైపు నయీం బతికుండగా రియల్‌ఎస్టేట్ రంగానికి సంబంధించి బెదిరింపులకు సంబంధించి బాధితుల ఫిర్యాదు టోల్ ఫ్రీ నంబర్ కు స్పందన అంతంత మాత్రంగానే ఉంటుంది. తొలి రోజు కేవలం 14 ఫిర్యాదులు మాత్రమే రాగా, అవి అంతంత మాత్రమేనంట. ప్రభుత్వం నుంచి తగిన భరోసా కలగకపోవడం, ఈ తతంగం వెనుక ‘పెద్ద’ వ్యక్తుల పేర్లు బయటకి వస్తుండటంతో ఫిర్యాదు చేసేందుకు వణికి పోతున్నట్లు చెబుతున్నారు. కాగా, నయీం దందాలపై సమాచారం అందించాల్సిందిగా 9440627218 టోల్ ఫ్రీ నంబర్ ను కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ చీఫ్ వై.నాగిరెడ్డి స్వయంగా ప్రకటించిన విషయం విదితమే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more