ఇటీవల కాంగ్రెస్ యువనేతను టార్గెట్ చేసిన బీజేపి కేంద్రమంత్రులు అదే తప్పును చేశారు. పార్లమెంటులో దళితులపై జరుగుతున్న అఘాయిత్యాలపై చర్చ జరుగుతున్న క్రమంలో రాహుల్ గాంధీ చిన్నపాటి కునుకు తీయడం.. అదికాస్తా మీడయాకు చిక్కడం.. దాంతో బీజేపి నేతలు వీర లెవల్లో ఆయన చిత్తశుద్దిని శంఖించడం అంతా చకచకా జరిగిపోయింది. ఇది చూసిన దేశ ప్రజలకు బీజేపి నేతలు, అందునా కేంద్ర మంత్రులు, ఎంపీలు అటు లోక్ సభతో పాటు ఇటు పార్టీ కార్యక్రమాలలో కూడా చాలా ఉత్సహంగా వుంటారని.. ఇక ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అంశానికి సంబంధించి మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తారని దేశప్రజలు భావించారు.
అలాంటి దేశప్రజల భావనను కేంద్రమంత్రులు అందునా సీనియర్ మంత్రులు.. కీలక శాఖల మంత్రులు రాహుల్ గాంధీ చేసిన పోరబాటునే చేశారు. ఏదో ఒకరు ఇద్దరు కాదు.. రమారమి అందరూ అదే బాటలోనే పయనించారు. 70వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతిని ఉద్దేశించి గంభీరంగా ప్రసంగించారు. దాదాపు 94నిమిషాలపాటు ఆయన ప్రసంగం కేంద్రమంత్రులకు లాలిపాటలా అనిపించిందో లేక జోలపాటలా అనిపించిందో తెలియదు కానీ అందరూ అడపాదడపా కునుకుపాటుకు గురయ్యారు.
అటు ప్రజలు కూడా ప్రధాని సుదీర్ఘ ప్రసంగం బోర్ కోట్టిందో ఏమో తెలియదు కానీ.. నలభై నిమిషాల తరువాత వారు తమ సీట్లలోంచి కదులుతూ కనిపించగా, కొందరు తమ ఇళ్లకు చేరుకునేందుకు మొగ్గుచూపారు. ఇంకొందరు ఆహూతులు మాత్రం మోడీ ప్రసంగాన్ని శ్రద్ధగా అలకించారు. కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, మనోహర్ పరీకర్, అనంత కుమార్, ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తదితరులు ప్రధాని మోదీ ప్రసంగిస్తుండగా.. నిద్రలోకి జారుకున్నట్టు కనిపించారు. కళ్లుమూసి నిద్రమత్తులో ఉన్నట్టు కనిపించిన వారి దృశ్యాలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
స్వాతంత్ర దినోత్సవ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘంగా ప్రసంగించిన ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ కొత్త రికార్డు సృష్టించగా మంత్రులు మాత్రం నిద్రలోకి జారుకున్నారు. కేంద్ర ప్రభుత్వ విజయాలు, అభివృద్ధి, వ్యూహాలు, పాకిస్థాన్‌కు గట్టి సందేశం ఇలా పలు అంశాలపై ఈసారి ప్రధాని ప్రసంగం సుదీర్ఘంగా సాగి మరో రికార్డు సృష్టించింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇప్పటికే విపాసన ధ్యానాన్ని పది రోజులు ప్రత్యేకంగా సాధన చేసి వచ్చారు. ఆ ప్రభావంతో కేజ్రీవాల్ ధ్యానముద్రలో మునిగిపోగా.. ఆయనను చూసి బీజేపీ నేతలు కాస్తా ధ్యానాన్ని నేర్చుకొని ఉంటారని నెటిజన్లు ఛలోక్తులు విసురుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more