PV Sindhu enters badminton final, assured a medal

Shuttler pv sindhu enters olympic finals

Olympics 2016, India, Badminton, Rio 2016 Badminton, PV Sindhu, sindhu enters final, Badminton Finals, Badminton, Carolina Marin, India, Japan, Laura Sarosi, Nozomi Okuhara, Olympics 2016, PV Sindhu, Rio 2016, Rio Olympics 2016, Tai Tzu Ying, Team India, Wang Yihan, Women's badminton, latest Olympics 2016 news, olympics news

India's PV Sindhu thumped Nozomi Okuhara of Japan to enter the final of the women's singles event of badminton competitions at the Rio Olympics 2016

రియో ఒలంపిక్స్ లో మార్మోగిన సింధుభేరి.. ప్రశంసల వెల్లువ

Posted: 08/18/2016 09:49 PM IST
Shuttler pv sindhu enters olympic finals

రియో ఒలంపిక్స్ లో ప్రాతినిథ్యం వహించిన భారత్ సిగలో ఎవరెవరు పతకాల పుష్పాలను అలకరిస్తారా.? అంటూ ఎదురు చూసిన క్రీడాభిమానులకు తెలుగుతేజం పివి సింధు శుభవార్తనందించింది. రియో ఒలంపిక్స్ లో విజయభేరి మ్రోగించిన సిందూ.. తన అద్భుత ప్రతిభతో చరిత్ర సృష్టించింది. రియో ఒలంపిక్స్ లో భాగంగా ఇవాళ జరిగిన మ్యాచ్ లో జపాన్ క్రీడాకారిణి ఒకుహరను ఓడించి ఏకంగా పైనల్స్ లోకి దూసుకెళ్లి స్వర్ణం పతకం సాధించేందుకు మరో అడుగు దూరంలో వుంది. సెమీఫైనల్లో జపాన్ క్రీడాకారిణి ఒకుహరాపై వరుస సెట్లలో 21-19, 21-10 తేడాతో విజయం సొంతం చేసింది. దీంతో సింధూకు రజితం ఖాయం అయ్యింది.

ఫైనల్స్‌ కూడా గెలిస్తే బ్యాట్మింటన్‌లో అద్భుతం జరగనుంది. భారత్‌కు బంగారు పతకాన్ని అందించనుంది. ఫైనల్లో స్పెయిన్ క్రీడాకారిణి మరిన్‌తో రేపు సాయింత్రం 7.30కి తలపడనుంది. మొదటి సెట్లో విజయాన్ని సొంతం చేసుకున్న సింధూ సెకండ్ సెట్‌లో హోరాహోరీ పోటీని ఎదుర్కొంది. అయితే ఒక సమయంలో జపాన్ క్రీడాకారిణి చేతులెత్తేసింది. ఏమాత్రం పోటీ ఇవ్వకుండా కనబడింది. ఓటమి బాధ ఆమె మొఖంలో కనబడింది. దీంతో సెకండ్ సెట్‌ను 11 పయింట్ల తేడాతో గెలిచి మ్యాచ్‌ను మరో సెట్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో ఘనవిజయం సాధించింది.

అంతేకాక ఒలింపిక్స్‌లో భారత తరపున బ్యాడ్మింటన్‌లో పతకం గెలిచిన అత్యంత పిన్నవయస్కురాలు సింధూనే కావడం గమనార్హం. అద్భుతమైన ఆటతీరుతో వరుస సెట్లతో ప్రత్యర్థిని మట్టి కరిపించిన సింధు ఒలింపిక్స్‌లో స్వర్ణానికి ఒక్క అడుగుదూరంలో నిలిచింది. శుక్రవారం జరగనున్న ఫైనల్స్ లో స్పెయిన్ క్రీడాకారిణి కోరోలినా మరిన్‌తో సిందు తలపడనుంది. ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకం అందించిన ఐదో అమ్మాయిగా రికార్డులకెక్కింది. కాగా ఇప్పటి వరకు ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకం అందించిన మహిళల్లో వెయిట్‌లిఫ్టిర్ కరణం మల్లేశ్వరి, బాక్సర్ మేరీకోమ్, షట్లర్ సైనా నెహ్వాల్ పతకాలు సాధించగా ఈ ఒలింపిక్స్‌లో నిన్న రెజ్లర్ సాక్షి మలిక్, ఈరోజు తెలుగమ్మాయి పీవీ సింధు ఆ జాబితాలో చేరారు.

అద్భుత ఆటతీరుతో రియోలో భారత్‌కు మరో పతకం సాధించిపెట్టిన తెలుగమ్మాయి పీవీ సింధుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ అభినందించారు. తన ఆటతీరుతో భారత్ గర్వపడేలా చేశావని ప్రధాని కొనియాడారు. ఫైనల్ పోరులోనూ ఇదే ఆటతీరుతో పోరాడి స్వర్ణంతో భారత్‌లో అడుగుపెట్టాలని ఆంకాంక్షించారు. వీరితో పాటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, చంద్రశేఖర్ రావులతో పాటు పలువురు నేతలు అమెకు అబినందనలు తెలిపారు, అటు సోషల్ మీడియాలోనూ సింధుకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు జాతీయ, రాష్ట్ర నేతలు అభినందనలు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sadak bund planned by t jac put off
Parliament became unruly over hyderabad bomb blast  
Rate This Article
(0 votes)
Tags : pv sindhu  rio olympics  finals  badminton  

Other Articles