అమెరికా, అగ్రరాజ్యం అంటూ చదువుల కోసం, ఉద్యోగాల కోసం అడుగుపెట్టిన యువత జీవితాల వెనుక చీకటి కోణాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. సులువుగా డబ్బు వచ్చే మార్గాలను ఎంచుకుని తప్పటడుగులు వేస్తున్నాయి. డాలర్ల మోజులో పోర్న్ చిత్రాలవైపు అడుగులు వేస్తున్నాయి. దిగ్బ్రాంతి కలిగించే అంశాలను పరిశీలిస్తే కొన్ని ఉదాహరణలు.
హైదరాబాద్ కి చెందిన 23 ఏళ్ల మధ్యతరగతి యువతి బీ-ఫార్మ్ పూర్తి చేసి, పై చదువుల కోసం అమెరికా వెళ్లింది. అక్కడికి వెళ్లాక మనదేశానికే చెందిన కొందరు విద్యార్థులతో కలిసి ఓ అపార్ట్ మెంట్ లోఉంది. మంచి కుటుంబం నుంచి వచ్చిన ఆ విద్యార్థినికి జీవితంలో అదే అనుకోని మలుపు అయ్యింది. తన తోటి విద్యార్థుల లగ్జరీ లైఫ్ ఆమెను ఆకర్షించింది. వారంతా మిడిల్ క్లాస్ కు చెందిన వారే, అయినా అసలు అంత డబ్బు వారికి ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోయింది. ఉండబట్టలేక ఆరా తీయగా, అసలు విషయం తెలిసి నోరు వెళ్లబెట్టింది.
వారంతా పోర్న్ సినిమాల్లో నటించి సంపాదించుకుంటారని చెప్పారు. అంతేకాదు విదేశాల్లో ఇండియన్ యువతుల నీలిచిత్రాలకు బాగా గిరాకీ ఉంటుందని ఆమెకు హితబోధ చేశారు. బుద్ధి పక్కదారి పట్టిన ఆ యువతి సుఖంతోపాటు, జల్సాకు సొమ్ము దక్కుతుంది కదా అనుకుంది. అంతే తాను కూడా ఆ ఊబిలోకి దిగింది. రాను రాను ఆమె ఆరోగ్యం క్షీణించటం మొదలుపెట్టింది. దీంతో ఇండియాకు తిరిగి వచ్చేసింది. ఇక్కడ టెస్ట్ లు చేసిన డాక్టర్లు ఆమె పేరెంట్స్ కు దిగ్భ్రాంతి కలిగించే విషయాలు చెప్పారు. దీంతో షాక్ తినటం తల్లిదండ్రుల వంతు అయ్యింది.
ఇలా మన రాష్ట్రానికి చెందిన వారే కాదు... కోటి ఆశలతో విదేశాల్లోకి అడుగుపెట్టే ఇండియన్ యువతకు అక్కడి పాశ్చాత్య సంస్కృతి, ఈజీ మనీ కి అలవాటుపడటం, వ్యసనాలు అన్ని చెడుదారి పట్టిస్తున్నాయి. దాదాపు 3 శాతం యువతులు ఇలా నీలిచిత్రాల్లో నటించడం, వేశ్యవృత్తిలోకి దిగటం లాంటివి చేస్తున్నారంటూ పోర్న్ హబ్ వెబ్ సైట్ నివేదిక కూడా వెలువరించింది. వెరసి జీవితాలను నాశనం చేసుకోవటం తప్పించి వారు సాధించేది ఏంలేదు. సో... పేరెంట్స్ ఇతర ప్రదేశాలకు పంపడం, వారికి స్వేచ్చను ఇవ్వటమే కాదు. ఆ స్వేచ్ఛను వారు ఎలా ఉపయోగించుకుంటున్నారో ఓ కంట కనిపెట్టాల్సిన బాధ్యత మీకుంది. అదే టైంలో పెరేంట్స్ కు వాల్యూ ఇచ్చి ఇలాంటి అడ్డదారులు తొక్కకుండా ఉండాల్సిన బాధ్యత యువతదే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more