BAI announces cash rewards for PV Sindhu, Pullela Gopichand

Bai announces 50 lakhs cash reward for pv sindhu

pv sindhu cash reward, cash award pv sindhu, pv sindhu award pullela gopichand, pullela gopichand award

The World No. 10 lost to Spain's Carolina Marin by 21-19, 12-21, 15-21 in the thrilling final match held at Riocentro.

సింధు, గోపిచంద్ లకు బీఏఐ నజరానా..!

Posted: 08/20/2016 08:07 AM IST
Bai announces 50 lakhs cash reward for pv sindhu

భారత మాత కీర్తికిరీటంలో మరో స్వర్ణ ఖచ్చిత వజ్రాన్ని జోడించేందుకు అమె చేసిన ప్రయత్నం అంతాఇంతా కాదు. ప్రపంచంలోనే ప్రముఖులుగా టాపర్లుగా పేరొందిన భారత క్రీడాకారులకు సవాల్ విసురుతూ అమె రియో ఒలంపిక్స్ కదనరంగంలోకి అడుగుపెట్టింది. దిగ్గజాలుగా పేరొందిన వారే రిక్తహస్తాలతో వెనుదిరుగుతున్న క్రమంలో అమె క్వార్టర్ ఫైన్సల్ కు చేరింది. అయినా అమెవైపు భారత జాతి చూడలేదు. క్వార్టర్స్ లో ప్రత్యర్థిని ఓడించి సెమీస్ లోనూ రాణించి ఫైనల్స్ లోకి ప్రవేశించింది. అంతే యావత్ దేశమంతా సింధూ మానియా కనిపించింది. ఎక్కడ చూసినా.. ఏ ఇద్దరు కలసినా.. ఏ ప్రతిక చూసినా.. ఏ టీవీ ఛానెల్ వీక్షించినా.. అటు సోషల్ మీడియాలోనూ అంతా సింధూ నామస్మరణే.

సింధూ స్వర్ణం గెలవాలన్న ఆకాంక్షను భారత దేశ ప్రజలు బలంగా వినిపించారు. తుదిమెట్టుపై స్వర్ణం చేజారినా.. రజతపతకంతో మెరిసింది. మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఫైనల్ సమరంలో సింధు పోరాడి ఓడిపోయింది. గంటకుపైగా హోరాహోరీగా సాగిన పోరులో 21-19,  12-21, 15-21 స్కోరుతో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకర్ కరోలినా మారిన్ చేతిలో ఓటమి చవిచూసింది. అయితేనేం.. ఎవరూ ఊహించని రీతిలో రియోలో జరిగిన ఒలంపిక్స్ లో అమె చరిత్రను సృష్టించింది. మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఈవెంట్ లో ఒలంపిక్స్ లో రజతం సాధించిన తొలి భారతీయ క్రీడాకారణిగా అమె చరిత్రపుటలకెక్కారు.

రియోలో భారత్ కు అసలు పతకాలే దక్కే ఛాన్స్ లేదన్న భావనను కొట్టిపారేస్తూ మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ కాంస్య పతకాన్ని తీసుకురాగా, మరో అడుగు ముందుకేసిన సింధు రజత పతకాన్ని సాధించింది. ఈ క్రమంలో ఒలింపిక్స్ లో సత్తా చాటిన సింధుకు భారత బ్యాడ్మింటన్ సమాఖ్య (బీఏఐ) రూ.50 లక్షల నజరానాను ప్రకటించింది. అదే సమయంలో సింధుకు మెరుగైన శిక్షణ ఇచ్చి, దేశానికి పతకం తెచ్చేలా కృషి చేసిన కోచ్ పుల్లెల గోపీచంద్ కు రూ.10 లక్షల నజరానాను అందించనున్నట్లు బీఏఐ వెల్లడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles