తనకున్న భయంకర వ్యాధిని దాచిపెట్టి ఓ అమ్మాయి గొంతు కోద్దామనుకున్న వ్యక్తికి తగిన శాస్త్రే జరిగింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు ఏర్పాటు చేసిన బ్యానర్లే తన కొంపముంచాయని తెలుసుకున్న వరుడు ఇప్పుడు తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. ఇక వరుడి బాగోతం బట్టబయలు కావడంతో వధువు పెళ్లికి నిరాకరించింది... అయితే పెళ్లి మాత్రం జరిగింది. అర్థం కాలేదా?
తమిళనాడులోని తిరువన్నామలైకు చెందిన ఓ వ్యక్తికి ఇటీవల పెళ్లి కుదిరింది. శనివారం వివాహం నిర్వహించేందుకు ఇరు కుటుంబాల వారు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా వరుడి కుటుంబ సభ్యులు, స్నేహితులు పెద్ద ఎత్తున బ్యానర్లు ఏర్పాటు చేశారు. సరిగ్గా ఇవే వధువును అతడి బారి నుంచి రక్షించాయి.
బ్యానర్లను చూసిన ఓ వ్యక్తి వెంటనే జిల్లా కలెక్టర్ ఎస్.పళనికి ఫోన్ చేసి మరికొన్ని గంటల్లో పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి ఎయిడ్స్‌తో బాధపడుతున్నాడని, వధువును రక్షించాలని కోరాడు. వెంటనే అప్రమత్తమైన కలెక్టర్ జిల్లా ఎస్పీ ఆర్.పొన్ని, మెడికల్ సర్వీసెస్ జాయింట్ డైరెక్టర్‌కు విషయాన్ని చేరవేశారు. వారు ప్రభుత్వ ఆస్పత్రిలోని రికార్డులు పరిశీలించి వరుడికి హెచ్ఐవీ సోకినట్టు నిర్ధారించారు. ఆ వెంటనే రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేసి పెళ్లి జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి వివాహాన్ని ఆపాలని ఆదేశించారు.
ఈలోగా తహశీల్దార్ వధువు చెల్లెలు ఫోన్ నంబరు కనుక్కుని ఫోన్ చేసి మాట్లాడారు. అయితే ఆమె ఆ విషయాన్ని కొట్టిపారేసింది. దీంతో వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి విషయం చెప్పారు. తమకు కొందరు ఈ విషయం గురించి ముందే చెప్పారని, అయితే పెళ్లి ఆపేందుకే వారలా చెబుతున్నారని భావించామని పేర్కొన్నారు. విషయం వధువుకు తెలియడంతో పెళ్లికి నిరాకరించింది. తమ కుమార్తె జీవితాన్ని కాపాడిన కలెక్టర్ ఇతర అధికారులకు వధువు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. కాగా అదే మండపంలో మరో బంధువులలో ఓ వ్యక్తి ఆమెను పెళ్లి చేసుకోవటంతో కథ సుఖాంతమైంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more