మాతృత్వం పోందడమన్నది ఓ వరం. కానీ పరాయి పిల్లలకు మాతృత్వాన్ని అద్దెకివ్వడం.. అద్దె గర్భం దాల్చడం ఇకపై నేరమే. పిల్లలు లేని దంపతులకు వైద్యశాస్త్రం అందించిన వరం అద్దె గర్భం (సరోగసీ) విధానం. అయితే, ఈ విధానాన్ని దుర్వినియోగం చేస్తూ పెద్ద ఎత్తున వ్యాపారం సాగుతున్న నేపథ్యంలో.. ఈ వ్యాపారాన్ని పూర్తిగా నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం సరోగసి చట్టాన్ని తీసుకువస్తున్నది. బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదించిన ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే.. సరోగసీ కోసం పిల్లలు లేని దంపతులు ఇతర మహిళల గర్భాలను అద్దెకు తీసుకోవడం కుదరదు. ఇందుకోసం వారు తమ బంధువులు, లేదా తెలిసిన వారి సహాయం మాత్రమే తీసుకొనే అవకాశం ఉంటుంది.
'వాణిజ్య సరోగసీపై పూర్తి నిషేధం ఉంటుంది. వైద్యపరంగా పిల్లలు పొందలేని దంపతులు తమ సన్నిహిత బంధువుల సాయం తీసుకొని సరోగసీ ద్వారా పిల్లల్ని పొందొచ్చు. దీనిని అల్ట్రుయిస్టిక్ సరోగసీ అంటారు' అని కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు. ఈ బిల్లు ప్రకారం విదేశీయులు, ప్రవాస భారతీయులు, సింగల్ పెరెంట్, సహజీవనం చేసే దంపతులు, స్వలింగ సంపర్కులు సరోగసీ విధానం ద్వారా పిల్లలు పొందడానికి ఇకమీదట అనుమతించబోరు. 'ఓ జంట పెళ్లిచేసుకొని, కనీసం ఐదేళ్లు కలిసి జీవిస్తేనే' సరోగసీ విధానం అనుమతిస్తామని, వారికి ఇప్పటికే ఓ సంతానం ఉంటే ఇందుకు అనుమతించబోమని సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు.
తాజాగా తీసుకొచ్చిన సరోగసి బిల్లులో సెలబ్రిటీలకు ఎలాంటి మినహాయింపు ఉండబోదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ సందర్భంగా సుష్మస్వరాజ్ బాలీవుడ్ స్టార్ హీరోలు షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్లకు పరోక్షంగా చురకలు అంటించారు. 'ఇద్దరేసి పిల్లలు ఉన్నప్పటికీ సెలబ్రిటీలు సరోగసీ ద్వారా మరో బిడ్డను కన్నారు. వాళ్ల భార్యలు పిల్లల్ని గర్భంలో మోసే బాధను పొందలేరు కనుక వేరే మహిళల మీద ఆ భారాన్ని మోపారు' అని సుష్మా పేర్కొన్నారు. అదేవిధంగా అద్దెగర్భాన్ని మోసినందుకు సన్నిహిత బంధువు అయిన మహిళకు వైద్యఖర్చులు మాత్రమే చెల్లించాలని, అంతేకానీ ఎక్కువమొత్తంలో ఆశ చూపకూడదని ఈ బిల్లు స్పష్టం చేస్తున్నది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more