హత్యకు గురైన వినోద్ కుటుంబాన్ని ఓదార్చునున్న పవన్ | pawan kalyan going to meet Vinod Royal family

Pawan kalyan going to meet vinod royal family

pawan kalyan going to meet Vinod Royal family, pawan kalyan Vinod Royal, Vinod Royal family, Vinod Royal murder, Pawan fan murder, pawan tirupathi fam, pawan in tirupathi, Pawan with Vinod Royal family

pawan kalyan going to meet Vinod Royal family and colndolence to them.

వినోద్ కుటుంబాన్ని ఓదార్చనున్న పవన్

Posted: 08/25/2016 09:55 AM IST
Pawan kalyan going to meet vinod royal family

హీరోలపై అభిమానం ఓ హద్దులో ఉండాలి. అది మితిమీరితే ఎలా ఉంటుందో తాజాగా పవన్ కళ్యాణ్ అభిమాని వినోద్ హత్య ఉదంతం నిరూపించింది. ఆదివారం రాత్రి కర్ణాటక పరిధిలోని కోలార్ లో ఇద్దరు టాలీవుడ్ హీరోల అభిమానుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో అక్షయ్ కుమార్,  వినోద్ రాయల్ చంపేసిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజు పోస్ట్ మార్టం అనంతరం స్వగ్రామంలో అంత్యక్రియలు జరగ్గా, దానికి జనసేన, పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఇక చనిపోయిన వినోద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్ నేడు స్వయంగా తిరుపతి వెళ్లనున్నాడు. ఈ సంఘటన పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన పవన్, వినోద్ కుటుంబాన్ని కలిసి ఆర్థిక సాయం కూడా అందించనున్నట్లు సమాచారం. మరోవైపు వినోద్ మృతికి కారణమైన ఆ యంగ్ హీరో అభిమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని వినోద్ స్నేహితులు డిమాండ్ చేస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ పంక్షన్ కి అతగాడు ఎందుకు హాజరయ్యాడని, పైగా మద్యం సేవించి మరీ వచ్చాడని వారు ఆరోపిస్తున్నారు.

రెండు నెలల్లో అతడు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాల్సి ఉంది. ఈ సమయంలో అతను హత్యకు గురవ్వడంతో కుటుంబమంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. కాగా, ప్రస్తుతం తిరుపతిలో హైటెన్షన్ నెలకొంది. పవన్ పర్యటనతోపాటు, ఈ ఇద్దరు హీరోల అభిమానుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనే పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  tirupathi  Vinod raoyal  murder  meet  

Other Articles