ఓటుకు నోటుతో ఏం కాదంటున్న చంద్రబాబు | chandra babu take it easy comments on cash for vote scam

Chandra babu take it easy comments on cash for vote scam re investigation

AP CM chandra babu on cash for vote scam, chandra babu fire on IB, Chandra babu in cash for vote scam, AP CM in scam, chandrababu open on Cash for Vote scam, cash for Vote scam not serious, cash for vote scam re investigation

AP CM chandra babu take it easy comments on cash for vote scam.

ఓటుకు నోటు పిచ్చ లైటు!

Posted: 09/01/2016 10:45 AM IST
Chandra babu take it easy comments on cash for vote scam re investigation

తెలుగు రాష్ట్రాల మధ్య ఆరని చిచ్చును రగిల్చిన ఓటుకు నోటు కేసు తిరిగి తెర మీదకు రావటం తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. వైసీపీ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పిటిషన్‌ను విచారించిన ఏసీబీ ప్రత్యేకకోర్టు ఈ కేసును మళ్లీ విచారణ జరపి, నెల రోజుల్లో నివేదిక సమర్పించాలంటూ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో తన పర్యనటలన్నీ రద్దు చేసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు వరుసబెట్టి నేతలతో, ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్నారు. కోర్టు తీర్పు వెలువరించిన రోజు రాత్రి నుంచే ఆయన ఈ మంతనాలు జరుపుతున్నారు. ఈ క్రమంలో నిన్న ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

ఈ కేసులో ఏమీ లేదని పేర్కొన్న ఆయన, దీని ఆధారంగా చేసుకుని వైసీపీ తమను ఏమీ చేయలేదని కూడా చెప్పినట్లు సమాచారం. బెజవాడలోని తన క్యాంపు కార్యాలయం నుంచి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నియోజకవర్గ ఇంచార్జీలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ సందర్భంగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారంట. ‘‘ఓటుకు నోటు కేసు ప్రాతిపదికే చెల్లదని హైకోర్టు చెప్పినా... వైసీపీ నేతలు ఏసీబీ కోర్టుకు వెళ్లడంలో అర్థం లేదు. ఇందులో వైసీపీ ఊరికే అల్లరి చేస్తోంది. ఈ కేసులో ఏమీ లేదు. వాళ్ల వల్ల ఏమీ కాదు. పైగా ఇలాంటి కేసుల వల్ల వాళ్లకే చెడ్డపేరు వస్తుంది. మనం పనులు చేస్తుంటాం. వాళ్లు కేసులు వేస్తుంటారు. మనం రాష్ట్రం కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్నాం. వాళ్లు మనల్ని వెనక్కు ఎలా లాగాలా అని నిరంతరం ప్రయత్నిస్తున్నారు. వరుస కేసులతో ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలన్నదే వారి లక్ష్యం. అయినా వాళ్ల వల్ల ఏమీ కాదు’’ అని చంద్రబాబు వారితో వ్యాఖ్యానించినట్లు భోగట్టా.

మరోవైపు ఓటుకు నోటు కేసులో పరిణామాలను ఎప్పటికప్పుడు ముందస్తుగా కనిపెట్టడంలో విఫలమయ్యారని, దాని వల్ల తాను ఇబ్బందులు పడుతున్నానని నిఘా విభాగం అధికారులపై బాబు చిందులు వేసినట్లు చెప్పుకుంటున్నారు. ''రాష్ర్టంలో ఉన్న 175 మంది ఎమ్మెల్యేల కదలికలను కూడా తెలుసు కోలేకపోతున్నారు. అధికార పక్షంవారిని విడిస్తే, విపక్షంలో ఉన్నవారిలో 20 మంది మన పార్టీలోనే చేరారు, మిగిలిన 45 మంది కదలికలనూ కనిపెట్టలేకపోతున్నారా? రాజధానికి పక్కనే ఉండే ఎమ్మెల్యే నాకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించి ఉత్తర్వులు తెచ్చుకునే వరకూ మీకు తెలియదంటే మీ పనితీరు ఎలా ఉందో అర్ధం అవుతోంది'' అని ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం.

ఇక ఓటుకు నోటు కేసు లో నిందితుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సింహాకు ఏసీబీ కోర్టు సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్ 29న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. తదుపరి విచారణకు మరో ఎఫ్‌ఐఆర్ అవసరం లేదని కోర్టుకు ఏసీబీ తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP CM  Chandrababu  comments  cash for vote scam  

Other Articles