వాచ్ మెన్ పై దాడి ఘటనలో తమ గూటికి చెందిన ఉన్నతాధికారిని రక్షించిన పోలీసులు.. నలుగురు కానిస్టేబుళ్లతో పాటు ఉన్నతాధికారి పుత్రరత్నాన్ని కూడా అరెస్టు చేశారు. వీరంతా తమ నేరాన్ని స్వచ్చందంగా అంగీకరించడంతో వారిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించనున్నారు. అయితే ఎవరి అనధికార అదేశాల మేరకు నలుగురు కానిస్టేబుళ్లు అక్కడికి వెళ్లారో సదరు అధికారి, వికారాబాద్ స్పెషల్ బ్రాంచ్ సిఐ పై పోలీసులు చర్యలు తీసుకోలేదు.
సైదాబాద్‌లోని కరన్ బాగ్ ప్రాంతంలో బీడీఆర్ టవర్స్ అనే అపార్ట్మెంట్లో చిట్యాల అమృత్ అనే వ్యక్తి వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు. దీని పక్కనే వికారాబాద్ స్పెషల్ బ్రాంచ్‌లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న వేణుగోపాల్రాజ్ కుమారుడు అంబటి పృథ్వీరాజ్ కూడా ఉంటున్నాడు. అతడు పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నట్లు తెలిసింది. అపార్ట్మెంట్ వాచ్మెన్ అమృత్‌తో అతడు తరచు గొడవ పడేవాడు. ఈ నేపథ్యంలోనే పృథ్వీరాజు.. వాచ్మెన్ అమృత్‌తో 31వ తేదీ రాత్రి గొడవ పడ్డాడు. అపార్ట్మెంట్ నుంచి వెళ్లిపోవాలని బెదిరించాడు.
పృథ్వీ బెదిరించినా అమృత్ వెళ్లలేదు. దీంతో అతడు వెళ్లి తన తండ్రితో చెప్పడంతో భూరంతపల్లి శివరాజ్, చాకలి మల్లేశ్, ఉప్పరి రవి కుమార్, అంతిగిరిపల్లి రాజ్‌కుమార్ అనే నలుగురు పోలీస్ కానిస్టేబుళ్లు అమృత్ ఉంటున్న అపార్ట్ మెంట్ వద్దకు వచ్చి అతడిపై దాడి చేశారు. ఈడ్చుకెళ్లి కొట్టుకుంటూ స్టేషన్‌కు తీసుకెళ్లి మరోసారి కొట్టి విడిచిపెట్టారు. అతడి భార్య యాదమ్మ అడ్డుపడటంతో ఆమెపై కూడా చేయిచేసుకున్నట్లు తెలిసింది. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో కూడా రికార్డయ్యాయి. ఇది కాస్త వెలుగులోకి రావడంతో తీవ్ర స్థాయిలో సదరు పోలీసు అధికారి కుమారుడిపై విమర్శలు తీవ్ర స్థాయిలో వచ్చాయి. ఈ నేపథ్యంలో కేసు నమోదుచేసుకున్న పోలీసులు మొత్తం ఐదుగురుని అరెస్టు చేసి విచారిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more